coronavirus: తెలంగాణలో మరో ఇద్దరికీ కరోనా, సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల బాలుడికి...

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం రాత్రి నాటికి 39 ఉన్న పాజిటివ్ కేసుల బుధవారం నాటికి 41కి చేరాయి. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించిన.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన పాజిటివ్ కేసులు మాత్రం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

మరో ఇద్దరికి..

మరో ఇద్దరికి..

ఇటీవల సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ సోకింది. అతనితో ప్రైమరీ కాంటాక్ట్‌‌లో ఉన్న మహిళకు కూడా వైరస్ సోకింది. వీరిద్దరితో వైరస్ సోకిన వారి సంఖ్య 41కి చేరింది. ఇప్పటికే పరీక్షలు చేసిన 114 మంది రిపోర్ట్ రావాల్సి ఉంది. వారి నివేదిక తర్వాత పరిస్థితిపై స్పష్టత రానుంది. వైరస్ సోకిన వారిని ఇప్పటికే ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

లోకల్ కాంటాక్ట్..

లోకల్ కాంటాక్ట్..

రెండో దశలో లోకల్ కాంటాక్ట్ ద్వారా మొదటిసారి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఓ మహిళకు వైరస్ సోకిన సంగతి తెలిసిందే. మంగళవారం కొత్తగూడెం డీఎస్పీ(57), ఆయన ఇంట్లో పనిచేసే వంట మనిషికి కరోనా పాజిటివ్‌గా తేలింది. విదేశాల నుంచి వచ్చిన కుమారుడిని నిబంధనలకు విరుద్దంగా ఇంటికి తీసుకెళ్లి పెట్టుకోవడం వల్లే ఈ రెండు కేసులు నమోదయ్యాయి. లోకల్ కాంటాక్ట్ ద్వారా ఇప్పటివరకు మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి.

వివరాల ఆరా..

వివరాల ఆరా..

మొదటి లోకల్ పాజిటివ్ కేసుగా నమోదైన మహిళ.. ఎవరెవరిని కలిసింది.. ఎక్కడెక్కడ తిరిగిందనే సమాచారాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ టీమ్స్ సేకరిస్తున్నాయి. ఇక దుబాయ్ నుంచి వచ్చిన దంపతుల ద్వారా వారి కుమారుడికి కరోనా సోకింది. అలాగే ఇండోనేషియా నుంచి వచ్చిన బృందంతో కలిసి తిరిగిన కరీంనగర్ స్థానికుడికి కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇటీవల 600 మందితో కలిసి విదేశాల నుంచి వచ్చిన 15మందిని హోం క్వారెంటైన్ చేశారు.

Recommended Video

    Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
    ముగ్గురికి లోకల్ కాంటాక్ట్

    ముగ్గురికి లోకల్ కాంటాక్ట్

    మంగళవారం నమోదైన విదేశీ పాజిటివ్ కేసుల్లో రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తి, రంగారెడ్డి జిల్లా చందానగర్‌కు చెందిన 39ఏళ్ల మహిళ,హైదరాబాద్‌లోని బేగంపేట్‌కు చెందిన 61 ఏళ్ల మహిళ ఉన్నారు. వీరితో పాటు మరో ముగ్గురు లోకల్ కాంటాక్ట్ ద్వారా మరో ముగ్గురికి వైరస్ సోకింది. వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగినవారిని గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. కొంతమందిని కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో ఉంచారు. రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తిలోనూ కరోనా అనుమానిత లక్షణాలు బయటపడటంతో అతన్ని కూడా ఐసోలేషన్‌కి తరలించినట్టు సమాచారం.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+