అమరావతి అద్భుతంగా ఎదగాలి, సాయం చేస్తా: కెసిఆర్, ఏపీ ప్రజల కేరింత, హర్షధ్వనాలు

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన అనంతరం తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు సభను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు, దేశ, విదేశీ ప్రముఖుల పేర్లకు, ప్రజలకు, పెద్దలకు.. కెసిఆర్ తన తరఫున, తెలంగాణ తరఫున దసరా శుభాకాంక్షలు చెప్పారు.

గురువారం ప్రధాని మోడీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రముఖులు ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ... విజయ దశమి పర్వదినం రోజున ప్రారంభమైన అమరావతి ప్రపంచస్థాయి అద్భుత నగరంగా విరాజిల్లాలని ఆకాంక్షించారు. అంతా మంచి జరగాలన్నారు.

Photos: అమరావతి శంకుస్థాపన

AP Capital Foundation: KCR speech at Amaravati

తెలంగాణ తరఫున అమరావతి నిర్మాణానికి తాము సహకరిస్తామని చెప్పారు. అమరావతికి ఎలాంటి సహకారం కావాలన్ని తెలంగాణ తరఫున అందిస్తామని చెప్పారు. తాను ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చెప్పారు.

AP Capital Foundation: KCR speech at Amaravati

కెసిఆర్ మాట్లాడుతుంటే ప్రజల హర్షధ్వనాలు

తెలంగాణ సీఎం కెసిఆర్ మాట్లాడుతున్న సమయంలో ప్రజలు హర్షధ్వనాలు వ్యక్తం చేశారు. కెసిఆర్ మాట్లాడేందుకు నిలబడగానే ప్రజలు నినాదాలు చేశారు. ఆయన మాట్లాడిన అనంతరం కూడా నినాదాలు చేశారు. అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సిఎం కెసిఆర్‌కు పుష్పగుచ్ఛాలు ఇచ్చిన సమయంలోను ప్రజలు హర్షధ్వనాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+