Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బిల్స్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. ఈసారి ‘ఏఐ’

రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. తాజాగా, ఆయన మైక్రోసాఫ్ట్‌ మాజీ సీఈవో బిల్‌గేట్స్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్‌ పెట్టడంతో హైదరాబాద్‌ రూపురేఖలు మారిపోయాయని బిల్‌గేట్స్‌కు చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఏపీలో ఏర్పాటు చేయనున్న ప్రపంచస్థాయి ఏఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వామ్యం వహించాలని ఆయన కోరారు. దక్షిణ భారత్‌లో గేట్స్‌ పౌండేషన్‌ కార్యకలాపాలకు ఏపీని గేట్‌వేగా నిలపాలని మంత్రి లోకేశ్ కోరారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. మీ అమూల్యమైన సలహాలు ఏపీలో ఐటీ అభివృద్ధికి దోహదం చేస్తాయని బిల్‌గేట్స్‌కి తెలిపారు.

AP CM Chandrababu and Minister Lokesh meets Bill Gates in Davos

సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ హెల్త్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ డయాగ్నోస్టిక్స్‌ని ఏర్పాటు చేయడానికి బిల్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ తరఫున ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని కోరారు. ఏపీలో ఇన్నోవేషన్‌ ఇంక్యుబేషన్‌ ఎకో సిస్టంని నిర్వహించేందుకు ఆఫ్రికాలో హెల్త్‌ డ్యాష్‌బోర్డుల తరహాలో సామాజిక వ్యవస్థాపకతలో ఫౌండేషన్‌ తరఫున నైపుణ్య సహకారం అందిచాలని బిల్ గేట్స్‌కు విజ్ఞప్తి చేశారు. ఫౌండేషన్‌ సహకారంతో స్థానికంగా ఉత్పత్తులపై ప్రపంచ ఆవిష్కరణలను అమలు చేసేలా ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా బిల్ గేట్స్ మాట్లాడుతూ.. చంద్రబాబుని చాలా కాలం తర్వాత కలవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 1995లో ఐటీ కోసం 2025లో ఏఐ కోసం బిల్‌గేట్స్‌తో భేటీ అయ్యామని చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఎన్నో ఏళ్ల తర్వాత బిల్‌గేట్స్‌ని కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు చంద్రబాబు.

ప్రపంచ ఆర్థిక సదస్సు కోసం దావోస్‌ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో రోజూ పెట్టుబడుల వేట కొనసాగించారు. గ్లోబల్‌ కార్పొరేట్‌ కంపెనీల ప్రతనిధులతో సమావేశమై ఏపీలోని అవకాశాల గురించి వివరించారు. గూగుల్‌ క్లౌడ్‌, పెప్సీ కో, పెట్రోనాస్‌ సంస్థ ప్రతినిధులతో చర్చించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరారు.ఏపీలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని టెమాసెక్ హోల్డింగ్స్ భారత్ ెడ్ రవి లాంబాను మంత్రి లోకేష్ కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+