కెసిఆర్ ఇంటికెళ్లావ్ భేష్!: చంద్రబాబుకి దత్తాత్రేయ సన్మానం(పిక్చర్స్)
హైదరాబాద్: కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 23వ తేదీన తాను నిర్వహించనున్న అలయ్ బలాయ్ కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేశారు.
అదే సమయంలో సీఎం చంద్రబాబు... ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాలని బండారు దత్తాత్రేయను కోరారు. ఆహ్వాన పత్రం అందించారు. చంద్రబాబును ఆయన నివాసంలో బండారు దత్తాత్రేయ కలిశారు. ఇదే సమయంలో ఒకరిని మరొకరు శాలువా కప్పి సత్కరించుకున్నారు.
ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... కెసిఆర్, చంద్రబాబు కలవడం శుభసూచకమని చెప్పారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభివృద్ధి కోసం పాటు పడాలని సూచించారు. చంద్రబాబు - కెసిఆర్ కలయికను చాలామంది స్వాగతిస్తున్నారు. అయితే, అందులో రాజకీయ తదితర కోణాలు ఉన్నాయనే వారు ఉన్నారు.

బాబు - దత్తన్న
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు శాలువా కప్పి సత్కరిస్తున్న దృశ్యం.

బాబు - దత్తన్న
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అలయ్ బలాయ్ ఆహ్వాన పత్రిక ఇస్తున్న దృశ్యం.

బాబు - దత్తన్న
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పుష్పగుచ్ఛం ఇస్తున్న దృశ్యం.

బాబు - దత్తన్న
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి ఆహ్వాన పత్రం ఇస్తున్న దృశ్యం.

బాబు - దత్తన్న
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాసంకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుకుంటున్న దృశ్యం.












Click it and Unblock the Notifications