టిఆర్ఎస్‌లోకి టిడిపి నేతలు: చంద్రబాబు సీరియస్, కెసిఆర్‌కు హెచ్చరిక!
హైదరాబాద్: విపక్ష నాయకులను కొనుగోలు చేస్తే కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల్లో చులకన అవుతుందని తెలుగుదేశం అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు అన్నారు.
హైదరాబాద్‌లోని తన నివాసంలో జీహెచ్‌ఎంసీ పార్టీ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రకాశ్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు తదితరులతో చంద్రబాబు భేటీ అయ్యారు. వారితో గ్రేటర్, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులను పట్టించుకోకుండా గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేలా కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. మిత్రపక్షం బిజెపితే సమన్వయం చేసుకుంటూ మేయర్ పదవిని కైవసం చేసుకోవాలని నేతలకు సూచించారు.

నేడు చంద్రబాబు ఇంటికి కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల తొమ్మిదవ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నివాసంలో జరిగే ఒక శుభకార్యానికి హాజరుకానున్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఎన్టీఆర్ కుమార్తె లోకేశ్వరి కుమారుడి వివాహానికి చంద్రబాబు హాజరయ్యారు.
ఆదివారం, సోమవారం కూడా చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తాను నిర్వహిస్తున్న చండీయాగానికి ఆహ్వానించేందుకు ఆదివారం చంద్రబాబును కలుస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications