ఏపీలోని తెలంగాణ ఉద్యోగులకు రిలీవ్: సీఎం జగన్‌కు థ్యాంక్స్, సంబరాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన క్లాస్-3, క్లాస్-4 ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు చెందిన 711 మంది ఉద్యోగులు ఏపీలో పనిచేస్తున్నారు. వీరి తరపున కొంతమంది ప్రతినిధులు బుధవారం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి తెలంగాణ ప్రభుత్వంలో సర్వీసులు కొనసాగించేందుకు వీలుగా తమను రిలీవ్ చేయాలని విన్నవించారు.
ఈ క్రమంలో సానుకూలంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్.. వారిని రిలీవ్ చేసేందుకు అంగీకారం తెలిపారు. అనంతరం సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. సొంత రాష్ట్రానికి వెళ్తున్న ఉద్యోగులకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీ ప్రభుత్వం తమను రిలీవ్ చేయడంతో తెలంగాణ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అంతేగాక, వెలగపూడిలోని సచివాలయం వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
కాగా, గతంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ అంశాన్ని సీఎం జగన్ ప్రస్తావించగా, సానుకూలంగా స్పందించిన కేసీఆర్ సర్కారు తెలంగాణ నుంచి ఏపీకి సంబంధిత ఫైలును పంపింది. ఈ నేపథ్యంలో వెంటనే ఉద్యోగుల బదిలీ ఫైలును క్లియర్ చేసి తెలంగాణకు పంపాల్సిందిగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గొప్ప మనసుతో అంగీకరించి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications