కేటీఆర్‌కు ఏపీ సీఎం ఫోన్: కేసీఆర్ ఆరోగ్యంపై అడిగి తెలుసుకున్న సీఎం జగన్
అమరావతి: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు ఫోన్ చేసి.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాంహౌస్‌లో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యారు. బాత్రూంలో కాలుజారి పడిపోయారు. దీంతో ఎడమతుంటిలో ఫ్యాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆయన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఎవరూ ఆస్పత్రికి రావాల్సిన అవసరం లేదన్నారు. త్వరగానే ఆయన కోలుకుంటారని చెప్పారు.
కేసీఆర్‌కు హిప్ రీప్లేస్మెంట్ : బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సోమాజీగూడ యశోద హాస్పిటల్‌లో వైద్యులు హిప్ రీప్లేస్‌మెంట్ శస్త్ర చికిత్స ప్రారంభించారు. కేసీఆర్ కాలుజారి పడటంతో ఆయన ఎడమ తుంటికి గాయమైన విషయం తెలిసిందే. ఆపరేషన్ థియేటర్‌కు కేసీఆర్‌ను తరలించిన దృశ్యాలు బయటకు వచ్చాయి.
కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, హిమాన్షు, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్‌ను పరామర్శించారు. అనంతరం కేసీఆర్‌ను ఆపరేషన్ థియేటర్‌లోకి తరలించారు.
కేసీఆర్ కాలు జారి పడటంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఎడమ కాలి తుంటి ఎముక విరిగిందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. తుంటి ఎముక మార్పిడి చేయాలని, కోలుకోవడానికి 6 నుంచి 8 వారాలు పడుతుందని చెప్పారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications