వాళ్లు మా వాళ్లే, నగదు ఉందనడం అవాస్తవం: తెలంగాణ ఈసీకి ఏపీ డీజీపీ వివరణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణలో డబ్బు పంచుతున్నారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం ఏపీ పోలీసు శాఖను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ మంగళవారం సమాధానం ఇచ్చారు.
నోటీసులో పేర్కొన్న విధంగా తెలంగాణలో పట్టుబడిన వారు తమ ఇంటెలిజెన్స్ అధికారులేనని ఏపీ డీజీపీ తెలిపారు. అయితే, ఆ అధికారుల వద్ద నగదు ఉంనడం అవాస్తవమని అన్నారు. ఘటనకు సంబంధించిన వీడియోల ఎక్కడా కూడా డబ్బులు కనిపించలేదని అన్నారు.

మావోయిస్టుల కదలికలపై సమాచారం కోసమే ఏపీ అధికారులు తెలంగాణలో ఉన్నారని చెప్పారు. ఇంటెలిజెన్స్ సిబ్బంది ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని తెలిపారు. ఏపీకి తెలంగాణ ఇంకా ఇంటెలిజెన్స్ యూనిట్ ఉందని ఏపీ డీజీపీ తెలిపారు. ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీతో మాట్లాడిన తర్వాత సమగ్ర సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాగా, నాలుగు రోజుల క్రితం ధర్మపురిలో ఏపీకి చెందిన ముగ్గురు ఇంటెలిజెన్స్ అధికారుల(పోలీసులు)ను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. వారు డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు రావడంతో ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పలు పార్టీలు ఈసీకి ఫిర్యాదులు కూడా చేశాయి. దీంతో ఏపీ డీజీపీకి తెలంగాణ ఈసీ నోటీసులు జారీ చేసింది.
-
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా












Click it and Unblock the Notifications