ఏపీతో నీటి రగడ: టెలిమెట్రీ మిషన్‌ను ట్యాంపరింగ్ చేస్తున్నారని టి ఫిర్యాదు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం నెలకొంది. పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీ మిషన్‌ను ట్యాంపరింగ్ చేస్తున్నారని కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం నెలకొంది. పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీ మిషన్‌ను ట్యాంపరింగ్ చేస్తున్నారని కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు మంత్రి హరీష్ రావు కృష్ణా బోర్డు చైర్మన్ శ్రీవాత్సవకు ఫో్ చేశారు. టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేసిన మెకాట్రానిక్ సంస్థ పోతిరెడ్డిపాడు ప్రవాహాన్ని తక్కువ చూపిస్తోందని ఫిర్యాదు చేశారు.

అంతకుముందు హరీష్ రావు నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ కారణాలతో కనుమరుగైన చెరువుల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చెరువులను పునరుద్ధరించలేకుంటే అటవీ, ఇతర శాఖలకు ఆ ప్రదేశాలు ఇవ్వాలన్నారు.












Click it and Unblock the Notifications