తెలంగాణ నీరా తాగిన ఏపీ మంత్రి జోగి రమేష్, సుమన్: ఇక ఏపీలోనూ!

హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్ నగరంలోని నెక్లెస్‌రోడ్డులో ప్రారంభమైన నీరా కేఫ్‌ను తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్, ప్రముఖ సినీ నటుడు సుమన్ పరిశీలించారు. ఈ సందర్భంగా నీరా సేవించారు. నీరా తాగి, అక్కడ విక్రయిస్తున్న తినుబండారాల రుచి చూశారు. ఈ సందర్బంగా నీరా కేఫ్ స్టాళ్లతోపాటు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోటింగ్ గురించి తెలుసుకున్నారు.

నీరాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయనీ.. శాస్త్రీయంగానూ ఇది నిరూపితమైందని తెలిపారు జోగి రమేష్, సుమన్. వేదాల్లోనూ నీరా గురించి ప్రస్తావన ఉందని, కాలక్రమంలో నీరా గురించి తప్పుడు ప్రచారం జరిగిందని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జోగి రమేష్ తెలిపారు. గీతవృత్తి కార్మికులను ఆదుకునే విధంగా నీరా పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చినట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

AP minister jogi ramesh and film actor suman visited neera cafe

నీరా కేఫ్‌లను ఏపీలోనూ ఏర్పాటు చేసే విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని ఏపీ మంత్రి జోగి రమేష్ తెలిపారు. దీంతో ఏపీలోనూ నీరా కేఫ్ ఏర్పాటయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కాగా, హైదరాబాద్ నగరంలో ఏర్పాటైన నీరా కేఫ్‌కు మంచి స్పందన వస్తోంది. నీరా ఆరోగ్యానికి మంచిది కావడంతో అందరూ ఈ పానియాన్ని తాగేందుకు మొగ్గుచూపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా నీరాకుక మంచి ప్రచారం చేస్తోంది. కాగా, రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన, ప్రకృతి సిద్ధమైన నీరాను అందించేందుకు ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టామ‌ని శ్రీనివాస్ గౌడ్ నీరా కేఫ్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో గీత వృత్తిదారులు మాత్రమే నీరాను ఉత్పత్తి చేసి, అమ్మకాలు జరిపేలా నీరాపాలసీని రూపొందించామన్నారు. గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియాను రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచడం జరిగింద‌ని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అలాగే, శాశ్వత అంగవైకల్యం చెందిన వారికి గతంలో ఇచ్చిన రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని రూ. 5 లక్షలకు పెంచ‌డం జరిగిందన్నారు. కల్లు దుకాణాలు నెలవారి కిస్తీ, తాటి, ఈత చెట్ల పన్ను రద్దు చేయడం ద్వారా 7743 కల్లు దుకాణాలకు చెందిన 2లక్షల 34 వేల 576 కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+