వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ-తెలంగాణ మధ్య మరో గొడవ: రూ.4వేల కోట్లపై చిక్కులు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వాణిజ్య పన్నుల అంశంపై గొడవ రాజుకుంటోంది. విభజన చట్టంలోని సెక్షన్లు 50, 51, 56లను సవరించాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. సవరణ కోరడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

విభజన చట్టంలోని పలు అంశాలు తెలంగాణకు అనుకూంలగా ఉన్నాయని, వాటిని సవరించాలని ఏపీ పలు సందర్భాల్లో కోరుతోంది. తాజాగా, పై సెక్షన్లను సవరించాలని కోరుతోంది. ఇప్పటికే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 విషయమై ఏపీ - తెలంగాణ మధ్య సమస్యలు కొలిక్కి రాలేదు.

విభజనకు ముందు, సమైక్య ఏపీలో వ్యాపారులు రూ.4వేల కోట్లను కమర్షియల్ ట్యాక్స్ ఎర్రీర్స్‌ను చెల్లించారు. ఆయా రాష్ట్రాల వారు రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించవలసి ఉంటుంది.

AP to move court for Rs 4,000 crore commercial tax arrears

అయితే, విభజనకు ముందు చెల్లించారని కాబట్టి తమకు రావాలని ఏపీ చెబుతోంది. ఆ లెక్కన చూస్తే తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ నుంచే ఎక్కువ మంది వ్యాపారులు రుణాలు చెల్లించారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మొత్తం తెలంగాణకే వెళ్తుంది.

విభజనకు ముందు చెల్లించినందున తమకు రావాలని ఏపీ కోరుతోంది. ఎర్రీర్స్‌లో 52:48 శాతం ఉండాలని ఏపీ చెబుతోంది. విభజన చట్టంలో అలాగే ఉందని, వీటి విషయంలోను అలాగే ఉండాలని అంటున్నారు. ఇందుకోసం సవరణ చేయాలని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ సవరణకు ససేమీరా అంటోంది. కాగా, దీనిపై ఏపీ కోర్టుకు వెళ్లనుందని తెలుస్తోంది.

English summary
A row over commercial tax arrears has cropped up between Telangana and Andhra Pradesh with the AP government seeking an amendment to Sections 50, 51 and 56 of the AP Reorganisation Act, 2014. This, however, is being strongly opposed by the Telangana government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X