మోడీకేర్‌పై అపోలో సంగీతారెడ్డి ప్రశంసలు, తెలుగు రాష్ట్రాలపై
హైదరాబాద్: ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశ పెట్టిన మోడీ కేర్ పైన అపోలో ఆసుపత్రి జాయిండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి స్పందించారు. మోడీ కేర్ మంచి నిర్ణయమని చెప్పారు. దీని ద్వారా చాలామంది ప్రజలు లబ్ధి పొందుతారన్నారు.
ఆరోగ్య బీమాలోను ప్రధాని నరేంద్ర మోడీ నూతన అడుగు వేశారని ప్రశంసించారు. భారత దేశంలో ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ పెరుగుతోందన్నారు.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను పరిశీలిస్తే ఈ విషయం తెలిసిపోతుందన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోను శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రెండు రాష్ట్రాలు పటిష్టం చేశాయన్నారు.
హైదరాబాదులోని హెచ్ఐసీసీలో కొనసాగుతున్న బయో ఆసియా సదస్సులో రెండో రోజు ఇన్నోవేషన్ అండ్ ఎక్స్‌పోనెన్షియల్ మెడిసిన్ అనే అంసంపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు.












Click it and Unblock the Notifications