ఆర్టీసీలో విభజన సెగ, రీజనల్ మేనేజర్ పై దాడి?
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా.. ఏపీయస్‌ఆర్టీసీలో ఇంకా విభజన పూర్తి కాలేదు. ప్రత్యేక, సమైఖ్య రాష్ట్ర ఉద్యమాల సమయంలో ఆయా శాఖల్లో అధికారుల మధ్య గొడవలు ఏర్పడితే... ఇప్పుడు కొత్తగా వారి మధ్య విభజన సెగలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయం బస్ భవన్ లోని టాయిలెట్‌లో రెండు రోజుల క్రితం రీజనల్ మేనేజర్ సత్యనారాయణపై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై భిన్నవాదనలు వినిపిస్తున్నప్పటికీ విభజన సెగ నేపథ్యంలో ఆయనపై దాడి జరిగి ఉంటుందని ఎక్కువ మంది ఉద్యోగులు భావిస్తున్నారు.

టాయిలెట్‌లో జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. నెల రోజుల్లో విభజన ప్రక్రియ పూర్తి అవుతుందని భావిస్తున్న తరుణంలో ఉద్యోగుల పంపిణీపై రాజుకున్న వివాదమే ఆయనపై దాడికి కారణమని తెలుస్తోంది. ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన మండలాలకు చెందిన ఓ వ్యక్తి ఏపీయస్‌ఆర్టీసీ సంస్ధలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
ఐతే విభజన నేపథ్యంలో ఆ డైరెక్టర్ తమకొద్దంటే తమకొద్దని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు మధ్య వాదన జరిగిందని సమాచారం. ఈ వాదన కారణంగానే రీజినల్ మేనేజర్ సత్యనారాయణపై దాడి జరిగి ఉంటుందని అందరూ భావిస్తున్నారు.
టీఎంయూ ఆందోళన
రీజీనల్ మేనేజర్‌పై దాడిని నిరసిస్తూ బస్ భవన్ ఎదుట టీఎంయూ ఆందోళన చేపట్టింది. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications