నయీంకు నా కూతురంటే ప్రేమ, అందుకే వచ్చాం: సోదరి, తల్లి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: గ్యాంగస్టర్ నయీమ్ మృతదేహాన్ని చూసేందుకు అతని కుటుంబసభ్యులు మంగళవారం నగరానికి చేరుకున్నారు. నయీమ్ మృతదేహాన్ని చూసిన వారు కన్నీటిపర్యాంతమయ్యారు.

ఈ సందర్భంగా నయీమ్ సోదరి(అక్క) ఆసియా బేగం మాట్లాడుతూ.. తమ తమ్ముడు సంపాదించిన రక్త మూటలు తమకొద్దని, కేవలం మృతదేహం తీసుకుపోవడానికే వచ్చామని తెలిపింది. తమ్ముడితో తమకు ఎలాంటి సంబంధాలు లేవని తెలిపింది.

నయీమ్ తమను ఏనాడూ పట్టించుకునేవాడు కాదని, ఆర్థికంగా ఏ రకమైన సహాయం తీసుకోలేదని స్పష్టం చేసింది. అతన్ని కలవాలంటే అవకాశం ఉండేది కాదని, కనీసం ఫోన్ నెంబర్లు కూడా తమ వద్ద లేవని తెలిపింది.

'శుభకార్యాలకు రాకపోయేది. మా ఊర్లో మేము ఏదో కట్టెల మిషన్‌ను పెట్టుకొని బతుకుతున్నాం. మా కూతురు అంటే నయీంకు చాలా ప్రేమ. అందుకే మృతదేహం తీసుకపోవడానికి వచ్చాం' అని కన్నీటి పర్యాంతమైంది.

మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చూరీలో ఉన్న నయీం మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆమె తన కూతుళ్లు సజ్జు, సోను, బంధువులు సాజీదాబేగం, ఫయూం, సలీంలతో కలిసి వచ్చింది. నయీంను చూడక మూడు నెలలు గడిచిందని రాజమండ్రిలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించే నయీం చిన్నమ్మ కుమారుడు ఫయూం తెలిపాడు.

నయీం మృతదేహం

నయీం మృతదేహం

గ్యాంగ్‌స్టర్ నరుూం అంత్యక్రియలు మంగళవారం రాత్రి తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగాయ. మంగళవారం మధ్యాహ్నం 3.14నిమిషాలకు నయీం మృతదేహం ఆయన నివాసానికి చేరుకుంది.

నయీం కుటుంబసభ్యులు

నయీం కుటుంబసభ్యులు

నయీం మృతదేహం వెంట తల్లి తాహేరాబేగం, సహోదరి ఆసియా బేగం, బంధువులు సజ్జు, ఫహీమ్‌లు ఉన్నారు.

మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన జనం

మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన జనం

నయీం భార్యలు హసీనాబేగం, ఫర్హానాబేగంలతో పాటు అతని కుమారులు, కుమార్తెలు, అక్క సలీమాబేగం అంత్యక్రియలకు హాజరుకాకపోవడం పట్ల బంధువులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సాంప్రదాయానికి విరుద్దంగా అంత్యక్రియలు నిర్వహించబోమని ఫహీమ్, సాజీదాబేగం తేల్చి చెప్పారు.

నయీమ్ మృతదేహం

నయీమ్ మృతదేహం

నయీం రక్తసంబంధీకులకు కడసారి చూపు దక్కనివ్వాలని బంధువులు పోలీసులను వేడుకున్నారు. సమయంలో ఏఎస్‌పి గంగాధర్ జోక్యం చేసుకుని నయీం భార్యలపై కేసులు నమోదు కావడంతో అంత్యక్రియలకు హాజరుకావడం కష్టమని పరిస్థితులను అర్థం చేసుకుని అంత్యక్రియలు నిర్వహించాలని బంధువులను కోరారు. లేని పక్షంలో జరగబోయే పరిణామాలకు బంధువులే బాధ్యత వహించాలని తేల్చిచెప్పారు.

నయీం కుటుంబసభ్యులు

నయీం కుటుంబసభ్యులు

దీంతో మత పెద్దలు బంధువులతో చర్చించి అనంతరం ఇషా ప్రార్థనలు నిర్వహించేందుకు నయీం మృతదేహాన్ని మసీదుకు తరలించారు. ప్రార్థనల అనంతరం హజ్రత్ జమాలుల్ బహార్ దర్గా ఆవరణలో నయాం మృతదేహాన్ని ఖననం చేశారు. నయాం మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.


వాడుకుని చంపేశారు: నయీమ్ తల్లి

తన కుమారుడిని నక్సలైట్లకు వ్యతిరేకంగా వాడుకున్న పోలీసులే.. తమ తూటాలకు బలిచేసి కడుపుకోత మిగిల్చారని నయీముుద్దీన తల్లి తహేరాబేగం ఆరోపించారు. నయీం మృతదేహాన్ని మంగళవారం అతడి స్వగ్రామం భువనగిరి పట్టణానికి తీసుకొచ్చాక ఆయన తల్లి మాట్లాడుతూ.. తన కూమారుడిని కాల్చిచంపిన పోలీసులు, కనీసం అతడి భార్య బిడ్డలకు కడసారి చూపులు సైతం దక్కనివ్వకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాలుగు రోజుల క్రితమే తనను, తన కోడలు, ఇతర కుటుంబసభ్యులను పోలీసులు పట్టుకుపోయారని, కనీసం తమ కుమారుడు మృతిచెందాడని చెప్పకుండా చివరకు అతడి మృతదేహంతో భువనగిరికి తీసుకువచ్చారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+