వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమా? బీజేపీ, బండి సంజయ్ బహుముఖ వ్యూహాలతో చర్చ!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళతారని బలంగా భావిస్తున్న బీజేపీ వ్యూహం మారుతోందా? బండి సంజయ్ పాదయాత్రలతో ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న క్రమంలో, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేంజ్ చేసిందా? బస్సు యాత్రతో ప్రజాక్షేత్రంలోకి బండి సంజయ్ వెళ్లడం కోసం బీజేపీ సన్నాహాలు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునేనా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

గేమ్ ప్లాన్ చేంజ్ చేసిన కమల దళం

గేమ్ ప్లాన్ చేంజ్ చేసిన కమల దళం


సీఎం కేసీఆర్ త్వరలో అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్న సమయంలో బిజెపి రాష్ట్ర నాయకత్వం అందుకు అనుగుణంగా తమ గేమ్ ప్లాన్ చేంజ్ చేసింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధమని చెబుతున్న బిజెపి ఇప్పటి నుంచే సమరోత్సాహంతో ముందుకు కదులుతోంది. ఒకవేళ సీఎం కేసీఆర్ సడన్ గా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళితే దానికి తగ్గట్టుగా బీజేపీ కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.

దూకుడు పెంచుతున్న బీజేపీ ... ముందస్తుకు ముందస్తు వ్యూహం

దూకుడు పెంచుతున్న బీజేపీ ... ముందస్తుకు ముందస్తు వ్యూహం

ఇప్పటికి నాలుగు విడతలుగా బండి సంజయ్ పాదయాత్రను కొనసాగించారు. ప్రస్తుతం ఐదో విడత బండి సంజయ్ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలో సాగుతుంది. ఈ క్రమంలో బండి సంజయ్ పాదయాత్రను రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేయడం కోసం అదనంగా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఊహించని విధంగా ముందస్తు ఎన్నికలకు నగారా మోగిస్తే బండి సంజయ్ పాదయాత్ర పూర్తయ్యే అవకాశం లేదు. దీంతో గేమ్ చేంజ్ చేసిన బిజెపి బస్సు యాత్ర కు రెడీ అంటోంది. బస్సు యాత్ర ద్వారా బీజేపీ తన దూకుడు చూపించటానికి రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలోనే భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ దూకుడు పెంచుతుంది.

 పాదయాత్రతో పాటు ఆ పనులు పూర్తి చేస్తున్న బండి సంజయ్

పాదయాత్రతో పాటు ఆ పనులు పూర్తి చేస్తున్న బండి సంజయ్

ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బండి సంజయ్ జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఓ పక్క పాదయాత్ర నిర్వహిస్తూనే మరోపక్క సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ఐదో విడత పాదయాత్రలో ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం చేయడంతో పాటుగా, ఐదో విడత పాదయాత్ర ముగిసేసరికి ఉత్తర తెలంగాణ జిల్లాల ముఖ్య నేతలతో సమీక్షలు పూర్తిచేసి ఎన్నికలకు సమాయత్తం చేయాలని బండి సంజయ్ ప్లాన్ చేశారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గాల వారీగా యుద్ధ ప్రాతిపదికన సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఆరోవిడత పాదయాత్రకు రూట్ మ్యాప్ రెడీ.. బీజేపీ, టీఆర్ఎస్ వ్యూహాలతో పొలిటికల్ హీట్

ఆరోవిడత పాదయాత్రకు రూట్ మ్యాప్ రెడీ.. బీజేపీ, టీఆర్ఎస్ వ్యూహాలతో పొలిటికల్ హీట్

ఇదిలా ఉంటే ఐదో విడత పాదయాత్ర ముగిసిన నాలుగు రోజుల తర్వాత ఆరో విడత పాదయాత్రను కూడా చేయాలని రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు బిజెపి నాయకులు. మొత్తానికి ప్రజాక్షేత్రంలో ఉంటూ వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ కొట్టాలని బిజెపి నాయకులు చేస్తున్న ప్రయత్నం తో తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిజెపి, టిఆర్ఎస్ వేస్తున్న ఎత్తుగడలు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై చర్చ కు కారణమవుతున్నాయి.


English summary
BJP is rapidly changing strategies. On the other hand, Bandi Sanjay is conducting field level reviews of the constituencies in the fifth phase of the Padayatra. Bandi Sanjay's bus trip decision has also become a reason for debate on early elections..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X