వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రైతులు పరాయి దేశం వారా?కాంగ్రెస్,బీజేపీల విష ప్రచారం.!కేసీఆర్ రైతు సాయంపై సింగిరెడ్డి రియాక్షన్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన 600 మంది పంజాబ్, యూపీ, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల రైతు కుటుంబాలకు చేస్తున్న సాయంపై విపక్షాల విమర్శలను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఖండించారు. రైతులకు సీఎం చేస్తున్న సాయంపై కాంగ్రెస్, బీజేపీలు చిల్లర రాజకీయం మానుకోవాలన్నారు. తెలంగాణలో నేటి వరకు 80,755 రైతు కుటుంబాలకు రైతుభీమా అందించామని, దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి భీమా లేదన్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైతుభీమాతో వ్యవసాయ కుటుంబాలకు ధీమా అని మంత్రి పేర్కొన్నారు.

 కేసీఆర్ ఢిల్లీ పర్యటన.. జాతీయ పార్టీలకు దడ పుడుతుందన్న మంత్రి నిరంజన్ రెడ్డి

కేసీఆర్ ఢిల్లీ పర్యటన.. జాతీయ పార్టీలకు దడ పుడుతుందన్న మంత్రి నిరంజన్ రెడ్డి

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఢిల్లీలో మరణించిన రైతు కుటుంబాలకుచేస్తున్న 3 లక్షల రూపాయల సాయంపైకాంగ్రెస్, బీజేపీ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని, అసలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలలోఇలాంటి పథకం అమలు చేసే దమ్ముందా? అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిలదీసారు. కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు 50 వేల రూపాయల సాయం అందాలంటే ఎక్కని గడప, మొక్కనినాయకుడు ఉండేవాడు కాదన్నారు సింగిరెడ్డి. తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రైతు సంక్షేమ నిర్ణయాల మూలంగా రైతు ఏ కారణం చేత మరణించినా5లక్షల సాయం అందిస్తున్నామని గుర్తు చేసారు.

 రైతులకు సాయం చేచడం తప్పా.?బీజేపి, కాంగ్రెస్ లకు మంత్రి సింగిరెడ్డి సూటి ప్రశ్న

రైతులకు సాయం చేచడం తప్పా.?బీజేపి, కాంగ్రెస్ లకు మంత్రి సింగిరెడ్డి సూటి ప్రశ్న


అంతే కాకుండి రైతుభీమా అందుకున్న రైతులందరివీఆత్మహత్యలనికాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు ప్రచారం చేస్తోందని మండి పడ్డారు. రైతు డిక్లరేషన్లు కాదు ముందు మీరు పాలిస్తున్న రాష్ట్రాలలోవాటిని ఈ ఏడాది నుండి అమలుచేసి చూపాలని డిమాండ్ చేసారు. కాంగ్రెస్ పార్టీనిప్రజలు నమ్మడం అంటే గొర్రె కసాయివాడినినమ్మినట్లేనని, దశాబ్దాల కాంగ్రెస్ పాలన చూసి విసుగుచెంది, ప్రజలు ఆ పార్టీనిపక్కనపెట్టారన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. అధికారంకోసం కాంగ్రెస్, బీజేపీలు పగటి కలలు కంటున్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేసారు.

 మరణించిన కుటుంబాలకు కేసీఆర్ సాయం.. బీజేపీ, కంగ్రెస్ లు అభినందించాలన్న మంత్రి నిరంజన్ రెడ్డి..

మరణించిన కుటుంబాలకు కేసీఆర్ సాయం.. బీజేపీ, కంగ్రెస్ లు అభినందించాలన్న మంత్రి నిరంజన్ రెడ్డి..


ఢిల్లీలో పోరాడి అసువులు బాసిన రైతులకు ఈ దేశమంతా సంఘీభావంగా నిలిచి వారి కుటుంబాలనుబాసట నివ్వాల్సినఅవసరం ఉందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. వారి పోరాట ఫలితంగానేకేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం నల్ల వ్యవసాయ చట్టాలనువెనక్కుతీసుకుని క్షమాపణలు చెప్పిన విషయాన్ని సింగిరెడ్డి గుర్తు చేసారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న నల్లచట్టాలనుబీజేపీ ప్రభుత్వం అమలుచేసిందని, అందుకేఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకిమొహంలేకరైతులవద్దకు వెళ్లడం లేదన్నిరు. 16 నెలలు చలి, వాన, ఎండలలో పోరాడి మరణించినకుటుంబాలకు సాయంచేస్తున్నచంద్రశేఖర్ రావును అభినందించాల్సిందిపోయి విమర్శించడం సిగ్గుచేటన్నారు నిరంజన్ రెడ్డి.

 విషయం చిమ్మడం దురదృష్టకరం.. కాంగ్రెస్, బీజేపి కి వ్యవసాయ మంత్రి చురకలు

విషయం చిమ్మడం దురదృష్టకరం.. కాంగ్రెస్, బీజేపి కి వ్యవసాయ మంత్రి చురకలు


ఢిల్లీ ఉద్యమ రైతులు ఎవరోపరాయిదేశంవారు అయినట్లుజాతీయ పార్టీలయినకాంగ్రెస్, బీజేపీలు విషయం చిమ్మడం దురదృష్టకరమన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు చేస్తున్న సాయాన్ని విపక్షాలు స్వాగతించాలన్నారు. దేశంలో ఎక్కడ వ్యవసాయం చేసుకుంటున్నా రైతులు రైతులేనన్నారు. ఇకనైనా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపిలు విమర్శలనుకట్టి పెట్టి చంద్రశేఖర్ రావు సంకల్పాన్ని బలపరిచే ప్రయత్నం చేయలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.

English summary
State Agriculture Minister Singireddy Niranjan Reddy has condemned the opposition's criticism of Chief Minister Chandrasekhar Rao's assistance to the families of 600 farmers in Punjab, Uttar Pradesh, Haryana and Delhi who died in the Delhi peasant movement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X