Traffic Challan: ట్రాఫిక్ చలాన్లు పే చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..!
తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల వసూలు చేయడానికి రాయితీ ప్రకటించింది. దీంతో భారీ సంఖ్యలో వాహనదారులు చలాన్లు చెల్లిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫేక్ వెబ్ సైట్ క్రియేట్ చేసి మోసాలకు దెగపడుతున్నారు. WWW.echallantspolice.in పేరుతో ఫేక్ వెబ్ సైట్ క్రియేట్ చేసి మోసాలు చేస్తున్నారు.
చాలా మంది వాహనదారులు ఫేక్ వెబ్ సైట్ కు వెళ్లి డబ్బులు పోగోట్టుకుంటున్నారు. అయితే ఈ వెబ్ సైట్ లో పేమెంట్ చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. www.echallan.tspolice.gov.in/publicview వెబ్‌సైట్‌లో మాత్రమే నగదు పే చేయాలని పోలీసులు పేర్కొన్నారు. పేటీఎం, మీ-సేవా సెంటర్లలో పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసుకోవచ్చని పోలీసులు స్పష్టం చేశారు.

పెండింగ్ చలాన్లపై జనవరి 10 వరకు రాయితీ కొనసాగనుంది. దీంతో చాలా మంది చలాన్లు చెల్లించడానికి ఎగబడుతున్నారు. దీన్ని అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు.. నకిలీ వెబ్‌సైట్ ద్వారా చలాన్లు వసూలు చేస్తూ వాహనదారుల జేబులు కొల్లగొడుతున్నారు. దీంతో పోలీసులు సోషల్ మీడియా ద్వారా వాహనదారులను అప్రమత్తం చేశారు. నకిలీ వెబ్ సైట్లలోకి వెళ్లి డబ్బులు చెల్లించ వద్దని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం బైక్ లకు 80 శాతం, ఆర్టీసీ బస్సులు, ఆటోలకు 90 శాతం రాయితీ, నాలుగు చక్రాల వాహనాలకు, లారీలకు, భారీ వాహనాలకు 60 శాతం రాయితీ కల్పించారు. డిసెంబర్ 25 తర్వాత చలాన్లు పడిన వారికి రాయితీ వర్తించదని స్పష్టం చేశారు. డిసెంబర్ 25 లోపు వాహనాలపై పడిన చలాన్లకు మాత్రమే రాయితీ వర్తిస్తుందని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications