హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హుస్సేన్ సాగర్‌లో ప్రళయ సాహసం: కళ్లకు కట్టినట్లు చూపించారు

భాగ్యనగరంలోని హుస్సేన్ సాగర్‌లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ నిర్వహించిన మాక్ డ్రిల్ అందరినీ ఆకట్టుకుంది. ప్రళయ సాహసం పేరిట ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరంలోని హుస్సేన్ సాగర్‌లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ నిర్వహించిన మాక్ డ్రిల్ అందరినీ ఆకట్టుకుంది. ప్రళయ సాహసం పేరిట ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు.

మాక్ డ్రిల్

మాక్ డ్రిల్

హైదరాబాదులో భారీగా వర్షాలు, వరదలు సంభవిస్తే మునిగిన ఇళ్ల నుంచి ప్రజలను ఎలా రక్షించాలనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇందుకోసం హుస్సేన్ సాగర్‌లో సెట్టింగ్ వేశారు. సెట్టింగ్‌లు వేసిన అనంతరం మాక్ డ్రిల్ నిర్వహించారు.

కళ్లకు కట్టినట్లు చూపించారు

కళ్లకు కట్టినట్లు చూపించారు

సైన్యం హెలికాప్టర్ నుంచి తాడు సాయంతో కిందకు దిగింది. అక్కడి నుంచి పడవల సాయంతో నీట మునిగిన ఇళ్ల వద్దకు వెళ్లి, బాధితులను ఒడ్డుకు చేర్చారు. అనుకోని విపత్తు సంభవిస్తే ప్రజలను ఎలా రక్షించాలనే దానిని కళ్లకు కట్టినట్లు చూపించారు.

పడవల సాయంతో బాధితుల వద్దకు

పడవల సాయంతో బాధితుల వద్దకు

తొలుత బాధితులకు ఆహారపొట్లాలను అందించారు. ఆ తర్వాత సైన్యం తాడు సాయంతో కిందకు దిగి, పడవల సాయంతో బాధితల వద్దకు చేరుకున్నారు.

రెండు రోజుల పాటు మాక్ డ్రిల్

రెండు రోజుల పాటు మాక్ డ్రిల్

ఈ మాక్ డ్రిల్ రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. ఆదివారం పలువురు మంత్రులు హాజరయ్యే అవకాశముంది. రేపటి మాక్ డ్రిల్ కోసం సంజీవయ్య పార్క్, బతుకమ్మ ఘాట్ వద్ద సందర్శకులను అనుమతిస్తారు.

English summary
Army, NDRF conduct mock drill at Hussain Sagar in Hyderabad on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X