భార్య వేధింపులు తట్టుకోలేక ఆర్మీ జవాన్ ఆత్మహత్యాయత్నం.. ఏంటా స్టోరీ ?

జీవితం అంతా దేశానికి అంకితం చేస్తానని ఒట్టుపెట్టిన ఓ ఆర్మీ జవాన్... చివరకు తన వ్యక్తిగత జీవితం అలా మారుతుందని ఊహించలేకపోయాడు. భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ మండలంలోని మైలారంలో చోటు చేసుకోగా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

అరికిల్ల ప్రవీణ్‌ అనే వ్యక్తి.. సికింద్రాబాద్‌ తిరుమలగిరిలో ఉన్న టెరిటోరియల్‌ ఆర్మీ 125 బెటాలియన్‌లో జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే 2020లో అరికిల్ల ప్రవీణ్‌కు.. పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన రజనికతో పెళ్లి జరిగింది. అయితే ఈ జంట మొదట్లో బాగానే ఉన్నా ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు పీక్స్ కు చేరాయి. అయితే గత కొంతకాలంగా ఈ గొడవలు తీవ్రం కావడంతో.. భార్య రజనికతో పాటు ఆమె కుటుంబ సభ్యులు సైతం ప్రవీణ్‌ను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు అతని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

army-soldier-suicide-attempt-because-wife-harassment-in-telangana

అంతటితో ఆగకుండా ఉద్యోగానికి కూడా వెళ్లనివ్వకుండా.. ప్రవీణ్ ఆర్మీ ఐడీ కార్డును దాచి పెట్టారని ఆరోపిస్తున్నారు. చివరకు ఆర్మీ బేస్‌కి వెళ్లి అక్కడ కూడా గొడవ చేసినట్టు ప్రవీణ్ ఫ్యామిలీ మెంబర్స్ చెబుతున్నారు. ఈ ఘటనతో తీవ్రమనస్తాపానికి గురైన ప్రవీణ్.. సెలవుల్లో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడి హనుమకొండకు వెళ్లాడు. జూన్ 8న అక్కడ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ప్రవీణ్ అన్నకు సూసైడ్ చేసుకోవడానికి ముందు అన్న ప్రసాద్‌కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి మిలటరీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సూసైడ్ నోట్ కూడా గుర్తించారు.

ఆ లేఖలో.. డియర్ ఫ్రెండ్స్, నేను చనిపోతున్నా... మా అమ్మను మీ అమ్మలా చూసుకోండి. నా చావుకి కారణం ఎవరో వాళ్లకు తెలుసు. వాళ్ల టార్చర్ తట్టుకోలేక పోతున్నా. మన ఊరిలో వాలీబాల్ టీమ్ బతకాలి, ఎప్పుడూ ఆటను వదలొద్దు" అంటూ రాయడం అందరితో కంటతడి పెట్టిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+