'కెసిఆర్ ప్రభుత్వానికి కేంద్రమంత్రులు జైట్లీ, రాజ్‌నాథ్ ప్రశంసలు'

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు ప్రశంసించారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ జితేందర్ రెడ్డి బుధవారం నాడు అన్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో అఖిల పక్ష సమావేశం జరిగింది.

అనంతరం టిఆర్ఎస్ ఎంపీలు జితేందర్ రెడ్డి, రాజ్యసభ పక్ష నేత కె కేశవ రావు విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలను అన్నింటిని నెరవేర్చాలని తాము కేంద్రాన్ని కోరామని చెప్పారు. కరువు సాయం, పత్తి రైతుల సమస్యలు, హైకోర్టు విభజన తదితర అంశాల గురించి అడిగామని చెప్పారు.

చర్చల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నట్లు కే కేశవ రావు చెప్పారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక సమావేశాలను స్వాగతిస్తున్నామన్నారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగాలని కోరుకుంటున్నామన్నారు. రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతామన్నారు.

'Arun Jaitley and Rajnath prais TRS government'

జాగృతి ఆధ్వర్యంలో 2 లక్షల మందికి ఉపాధి: ఎంపీ కవిత

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్‌లోని శ్రావ్య గార్డెన్స్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

రాష్ట్రంలో నిరుద్యోగులు లేకుండా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. 2020 వరకు పెంజు లక్షల మంది యువతకు జాగృతి ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలు కల్పిస్త్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+