మద్దతివ్వండి: కేసీఆర్‌కు జైట్లీ లేఖ, ఎన్టీఆర్‌కు గౌరవమివ్వాలని రేవంత్
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం నాడు లేఖ రాశారు. జీఎస్టీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
జీఎస్టీ బిల్లును శాసన సభలో ఆమోదింప చేయాలని ఆయన కోరారు. ఇందుకోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇటీవల పార్లమెంటులో జీఎస్టీ బిల్లుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. జిఎస్టీ బిల్లుకు తెలంగాణ మద్దతు పలకనుంది.

కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి మంగళవారం నాడు బహిరంగ లేఖ రాశారు. ఎన్టీఆర్‌కు తెలంగాణ రాష్ట్రంలో సముచిత స్థానం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్‍కు సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ టెర్మినల్‌కు రాజీవ్ గాంధీ పేరు, దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేట్టాలని కేంద్రం గతంలో నిర్ణయించిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన సేవలకు గుర్తుగా దేశీయ టెర్మినల్‌కు ఆయన పేరును పెట్టి సముచిత గౌరవం ఇవ్వాలన్నారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అన్నారు.












Click it and Unblock the Notifications