TGSRTC: కార్తీకపౌర్ణమి వేళ అరుణాచల గిరి ప్రదక్షిణ చెయ్యాలనుకుంటే... హర్రీ అప్!

అరుణాచల గిరి ప్రదక్షిణ చెయ్యాలని ఎంతో మంది కలలు కంటారు. వారి కలలను సాకారం చేస్తుంది టీఎస్ ఆర్టీసీ. నేడు సాయంత్రం ఎంపిక చేసిన జిల్లాల నుండి ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ఇక కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలం గిరి ప్రదక్షిణ కు వెళ్లే వారికి టీజీఎస్ ఆర్టీసీ సువర్ణావకాశం ఇస్తుంది. అరుణాచలం దర్శనానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు స్పెషల్ ప్యాకేజీలను అందిస్తోంది.

అరుణాచల గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సులు
కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలానికి తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ప్యాకేజీని అందిస్తుంది.
అరుణాచలంలోని పరమశివుని దర్శనం కోసం చాలామంది పరితపిస్తారు. అటువంటి వారికి ఈ కార్తీకమాసంలో శుభవార్త చెప్పింది టీ జి ఎస్ ఆర్ టి సి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుండి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇక ఇదే విషయాన్ని ఆర్టీసీ ఎండి సజ్జనార్ వెల్లడించారు.

Arunachala Giri Pradakshina TGSRTC tour during Karthika pournami Starts today from these districts

ఈ జిల్లాల నుండి అరుణాచలం కు ప్రత్యేక బస్సులు
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ల నుండి అరుణాచలానికి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు పేర్కొన్నారు. ఈనెల 15వ తేదీన కార్తీక పౌర్ణమి కావడంతో తెలంగాణ రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు అరుణాచలానికి బయలుదేరుతున్నాయి. పౌర్ణమి రోజున అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

తెలంగాణ టూరిజం ప్యాకేజ్
ఈ క్రమంలోనే నవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుని దర్శించుకోవడం కోసం బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక టూర్ ప్యాకేజీ ని కూడా అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ టూరిజం. హైదరాబాద్ అరుణాచలం పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీ లో భాగంగా మూడు రాత్రులు, నాలుగు పగళ్ల టూర్ కొనసాగుతుంది. అరుణాచలం ఆలయంతో పాటు, కాణిపాకం వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ని కవర్ చేస్తూ ఈ టూర్ సాగుతుంది.

టూర్ సాగుతుందిలా
ఇక నెలలో ఒకసారి మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. నవంబర్ నెలలో 13వ తేదీన అరుణాచల గిరిప్రదక్షిణ టూర్ ప్రారంభమవుతుంది. 13వ తేదీ సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుండి తెలంగాణ టూరిజం బస్సు బయలుదేరుతుంది. మరుసటి రోజు నవంబర్ 14 ఉదయం 6 గంటలకు యాత్రికులు కాణిపాకం చేరుకొని ఉదయం 9 గంటల లోపు కాణిపాకం ఆలయంలో దర్శనం చేసుకుంటారు.

అరుణాచలంలో రాత్రి బస
మళ్ళీ అక్కడి నుంచి అరుణాచలం బయలుదేరుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అరుణాచలం చేరుకొని అక్కడ హోటల్లో బస చేస్తారు. అనంతరం అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆరోజు రాత్రి అరుణాచలంలోనే బస చేస్తారు. ఆపై నవంబర్ 15వ తేదీన బ్రేక్ఫాస్ట్ తర్వాత బస్సు మళ్ళీ బయలుదేరుతుంది. మధ్యాహ్నం కి వెల్లూరు శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శించుకుని దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం మొదలవుతుంది.

అరుణాచల గిరి ప్రదక్షిణ చెయ్యాలంటే ఇలా చెయ్యండి
ఇక నవంబర్ 16వ తేదీ ఉదయానికి మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటారు. ఒక హైదరాబాద్లో మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాలలో కూడా ఇదే టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీని http://tgsrtcbus.in వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు. సాయంత్రం బస్సులు ప్రారం అవుతున్న వేళ ఈ టూర్ లో అరుణాచలం వెళ్ళాలంటే ఇక దీనిపై మరిన్ని వివరాల కోసం టీజీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 04023450033, 040694400 నెంబర్లను సంప్రదించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+