ఢిల్లీ కాల్ రికార్డ్‌లు తీయండి, మోడీ! విద్యార్థులతో వద్దు: స్మృతిని టార్గెట్ చేసిన కేజ్రీ

హైదరాబాద్: వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఏఏపీ నేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం నాడు కేంద్రమంత్రి స్మృతి ఇరానీని టార్గెట్ చేశారు. ఆమె బుధవారం తప్పుడు సందేశం ఇచ్చారని ఆరోపించారు. ఆయన హైదరాబాదులోని హెచ్‌‍సియులో విద్యార్థులను పరామర్శించి, మాట్లాడారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య పైన పేపర్లలో వచ్చిన వార్తలను తాను చదివానని, ఈ మృతి పైన విషయం పూర్తిగా అర్థమవుతోందన్నారు. ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ పైన ఏఎస్ఏ విద్యార్థులు దాడి చేయలేదన్నారు.

ఏబీవీపీ నేతల వేధింపులతోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఎలాంటి విచారణ జరపకుండానే కేంద్ర మానవ వనరుల శాఖమంత్రికి విద్యార్థులకు వ్యతిరేకంగా లేఖ రాశారని ఆరోపించారు. ఏఎస్ఏ జాతి వ్యతిరేక సంస్థ కాదని చెప్పారు.

Arvind Kejriwal Attacks Smriti Irani Over Hyderabad Suicide

దత్తాత్రేయ లేఖ వల్లనే విద్యార్థులను సస్పెండ్ చేశారన్నారు. హెచ్చార్డీ నుంచి వచ్చిన లేఖ వల్లనే వైస్ ఛాన్సులర్ మారిపోయారని, కొత్తగా వచ్చిన వీసీ విద్యార్థుల పైన చర్యలు తీసుకున్నారన్నారు. రోహిత్ తన మెరిట్‌తో యూనివర్సిటీలో సీటు సంపాదించుకున్నాడన్నారు. రిజర్వేషన్లతో రోహిత్ యూనివర్సిటీకి రాలేదన్నారు.

అలాంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం దేశానికే అవమానమన్నారు. ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ ఆపరేషన్‌కు ఏఎస్ఏ విద్యార్థులతో గొడవకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. విశ్వవిద్యాలయాల్లో కులాల వారీగా చీలిక తెచ్చేందుకు ఏబీవీపీ ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు.

స్మృతి ఇరానీ కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి అని, ఏ విద్యార్థికీ అన్యాయం జరగకుండా ఆమె చూసుకోవాల్సి ఉందన్నారు. స్మృతి ఇరానీ ఈ వివాదాన్ని దళితులకు, ఇతర వర్గాలకు మధ్య వివాదంగా చిత్రీకరించారని ఆరోపించారు. బిజెపి వాళ్లకు ఏ ఐడియాలజీ లేదన్నారు. హిందువులకు కూడా వారు చేసిందేం లేదన్నారు.

బిజెపి వాళ్లు కేవలం పదవీ లాలసులు అన్నారు. వీసీ అప్పారావును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. స్మృతి ఇరానీ తప్పుదోవ పట్టించినందుకు ఆమె దేశానికి క్షమాపణ చెప్పాలని రెండో డిమాండ్ చేశారు. కేసులో స్మృతి ఇరానీ పేరు కూడా చేర్చాలన్నారు. ఘటనను తప్పుదారి పట్టించేందుకు స్మృతి ప్రయత్నిస్తున్నారన్నారు.

స్మృతి ఇరానీ నిన్న దేశాన్ని తప్పుదోవ పట్టించారన్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారి పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. తాను ప్రధాని మోడీకి ఓ సూచన చేస్తున్నానని.. విద్యార్థులతో పెట్టుకోవద్దన్నారు. దేశవ్యాప్తంగా యువత ప్రధాని మోడీ పైన కోపంతో ఉందన్నారు.

ఆరెస్సెస్ వారిని, ఏబీవీపీ వారిని బిజెపి ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సులర్లుగా నియమిస్తోందని ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్య బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చిన లేఖలతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన కాల్ రికార్డులను తీయాలని, అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ కూడా ఏఎస్ఏ విద్యార్థుల తప్పులేదని చెప్పారన్నారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.

అంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యూనివర్సీటీలో ఆందోళన నిర్వహిస్తున్న ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. వేముల రోహిత్ ఆత్మహత్య, అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. దీక్ష చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.

కేజ్రీవాల్ రాక సందర్భంగా.. విద్యార్థులు కొందరు బిజెపికి, వైస్ ఛాన్సులర్ అప్పారావుకు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రోహిత్ స్థూపం వద్ద కేజ్రీవాల్ నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడే ముందు 'జై భీమ్, రోహిత్ అమర్ రహే, వీ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేశారు. కేజ్రీవాల్ రోహిత్ తల్లిను కూడా కలవనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+