హై అలర్ట్, ముంచుకొస్తున్న తుఫాన్ - ఈ జిల్లాలకు అతి భారీ వర్షాలు..!!
తెలుగు రాష్ట్రాలను వరుణుడు వణికిస్తున్నాడు. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతుండగా, మరోసారి వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడని అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో తుఫాను గా మారి.. రానున్న నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో, అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రానున్న కొద్ది గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, ఈ వాయుగుండం ఈనెల 26 నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈనెల 27వ తేదీ ఉదయానికి నైరుతి బంగాళాఖాతం దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
ఇవాళ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ అల్పపీడన ప్రభావంతో గత రెండు, మూడు రోజులుగా వర్షాలు కురిశాయి.ఇవాళ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్లకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఈజిల్లాల్లో 7 సెం.మీ. నుంచి 12 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.హైదరాబాద్ లో కూడా కొద్దిపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసారు. ఈనెల 27 తర్వాత అల్పపీడనం తీరం దాటిన తర్వాత దాని ప్రభావం తెలంగాణపై పడుతుందని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications