ప్రగతి భవన్‌లో కరోనా.. కేసీఆర్‌ కూ వైరస్ సోకిదంటూ ప్రచారం.. తెలంగాణలో 8రెట్లు పెరిగిన కేసులు..

కొవిడ్-19కు సంబందించి తెలంగాణలో యాక్టివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరట కలిగించినా.. కొత్త కేసులు వెల్లువలా పుట్టుకొస్తుండటంతో కలకలం రేపుతున్నది. గడిచిన నెల రోజుల్లో రాష్ట్రంలో కేసులు ఎనిమిది రెట్లు పెరిగినట్లు వెల్లడైంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమైన ప్రగతి భవన్ లోనూ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది వైరస్ బారినపడటం ఆందోళనకరంగా మారింది. ఇదే సమయంలో.. సీఎం కేసీఆర్ కు కూడా కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

హరిత హారంలో వ్యాప్తి..

హరిత హారంలో వ్యాప్తి..

గత నెలలో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న హరిత హారం కార్యక్రమంలో వైరస్ వ్యాప్తి చెందిందంటూ వాట్సాప్ ఇతర సోషల్ మీడియా సాధనాల్లో సమాచారం విపరీతంగా షేర్ అవుతోంది. ప్రగతి భవన్ కు చెందిన ఐదుగురు ఉద్యోగులకు, అక్కడ సెక్యూరిటీ విధులు నిర్వహించిన కొత్తగూడెం బెటాలియన్ కు చెందిన 12 మంది పోలీసులకూ వైరస్ సోకినట్లు తెలిసింది. కేసీఆర్ సతీమణి శోభ కారు డ్రైవర్ కూడా పాజిటివ్ గా తేలిసినట్లు ప్రచారం జరుగుతోంది.

వైరల్ వార్తల్లో నిజమెంత?

వైరల్ వార్తల్లో నిజమెంత?

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోన్న తప్పుడు వార్తల్ని గుర్తించి, ప్రజలకు వాస్తవాలన్ని తెలియజేయడం కోసం 'ప్యాక్ట్ చెక్ తెలంగాణ' పేరుతో ప్రభుత్వమే ఓ వ్యవస్థను రూపొందించింది. కాగా, సీఎ కేసీఆర్ కు కరోనా సొకిందంటూ వాట్సప్ ఇతర సోషల్ మీడియాలో ప్రచారమవుతోన్న సమాచారంపై ఒకింత గందరగోళం నెలకొంది. దీనిపై ఫ్యాక్ట్‌చెక్ గానీ, ప్రభుత్వ వ్యవస్థలుగానీ స్పందించకపోవడాన్ని బట్టి ఇవి తప్పుడు వార్తలు కావొచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే,

నెలలో 8 రెట్లు పెరుగుదల..

నెలలో 8 రెట్లు పెరుగుదల..

జూన్ మొదటి వారం నుంచి జులై మొదటివారం దాకా వైరస్ వ్యాప్తి చెందిన తీరును బట్టి.. తెలంగాణలో కేసుల సంఖ్య ఎనిమిది రెట్లు పెరిగినట్లు నిర్ధారణ అయింది. జూన్ 1 కంటే ముందు కేసుల డబ్లింగ్(కేసుల సంఖ్య రెట్టింపు)నకు 17 రోజుల సమయం పడితే.. జూన్ నెలలో మాత్రం ప్రతి 8 రోజులకు సంఖ్య రెట్టింపవుతూ వచ్చింది. అలాగే, పాజిటివ్ కేసుల రేటు కూడా 20 శాతాని చేరువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.

Recommended Video

    Panic in Hyderabad as Top Jeweller Party With Hundreds of Attendees Got Corona || Oneindia Telugu
    ఆరో స్థానానికి తెలంగాణ..

    ఆరో స్థానానికి తెలంగాణ..

    శనివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.10లక్షల టెస్టులు నిర్వహించగా.. 22,312 పాజిటివ్ కేసులు తేలాయి. అందులో 11,537 మంది ఇప్పటికే వ్యాధి నుంచి కోలుకోగా, 10,487 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. తెలంగాణలో కొవిడ్ వల్ల చనిపోయినవారి సంఖ్య 288గా ఉంది. గడిచిన కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా ఉండటంతో కరోనా బాధిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఆరో స్థానానికి ఎగబాకింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+