నేను నోరు విప్పితే..: బీఆర్ఎస్ లక్ష్యంగా అసదుద్దీన్ ఒవైసీ సంచలన విమర్శలు

గత బీఆర్ఎస్ పాలనపై, బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. బీఆర్ఎస్ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ ప్రణాళికలు చేయలేదా? ఆ ప్రణాళిక వద్దని తాను చెప్పలేదా? అని ప్రశ్నించారు. మూసీ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఏమీ చేయలేదన్నారు.

అప్పటి విషయాలన్నీ బయటపెట్టాలా? మీ(బీఆర్ఎస్) జాతకాలన్నీ నా దగ్గర ఉన్నాయి.. నేను నోరు విప్పితే బీఆర్ఎస్ వాళ్లు ఇబ్బంది పడతారు అంటూ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇళ్లు కదల్చకుండా మూసీ ప్రక్షాళన చేస్తే స్వాగతిస్తామన్నారు. బీఆర్ఎస్ విధానాలు స్థిరంగా ఉండాలన్నారు. ఆ పార్టీకి జీహెచ్ఎంసీలో ఎక్కువ సీట్లు తమ వల్లే వచ్చాయని అన్నారు. ఎంఐఎం మద్దతుతోనే బీఆర్ఎస్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు.

Asaduddin Owaisi is the target of BRS sensational criticism

24 మందిని మార్చి ఉంటే బీఆర్ఎస్ మళ్లీ గెలిచేదని అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ నేతలకు అహంకారం ఉండేదన్నారు. తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి పోతున్నామని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం నేత.. ఇప్పుడు ఆ పార్టీపై విమర్శలు చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది ఇలావుండగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపైనా అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఎక్కువ మంది సంతానం ఉండాలని చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ అంటున్నారని గుర్తు చేశారు. అదే విషయాన్ని తాను చెప్పి ఉంటే రాద్ధాంతం చేసేవారని అన్నారు. దక్షిణ భారత్‌లో జననాల రేటు తక్కువగా ఉందని చంద్రబాబు గుర్తించారని చెప్పారు. జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి నష్టం అని అన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య తగ్గుతుందన్నారు. బాగా చేసిన రాష్ట్రాలను ప్రోత్సహించకుండా శిక్షిస్తే ఏం లాభం? అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.

మరోవైపు ఇటీవల హైడ్రాపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంలోని ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌ పరిధిలో ప్రభుత్వ భవనాలను కూల్చివేస్తారా అంటూ ప్రశ్నించారు. హుస్సేన్‌ సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో బల్దియా భవనాన్ని నిర్మించారని, దాన్ని కూడా కూల్చివేస్తారా అని నిలదీశారు. నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తుందని దాన్ని కూల్చివేస్తారా అంటూ ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+