ఐసీస్ వార్నింగ్: భయపడేది లేదన్న అసదుద్దీన్, భద్రత పెంపు
హైదరాబాద్: ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి ఐసిస్ వార్నింగ్ ఇచ్చింది. ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్ర పరిమాణాలుంటాయని హెచ్చరిక జారీ చేస్తూ బుధవారం అసదుద్దీన్ ఓవైసీకి ఉద్దేశించి ట్విట్టర్‌లో ఈ వ్యాఖ్యలు చేసింది.
@abotalout అనే ఐడీ ద్వారా ఓవైసీ ట్విట్టర్ అకౌంట్ వాల్‌పై రెండు ట్వీట్లను పోస్టు చేశారు. అంతేకాదు భారత్‌లోనూ ఐసిస్‌ను విస్తరించనున్నట్లు పేర్కొంది. ఈ ట్వీట్లపై ఎంపీ అసదుద్దీన్ కూడా కాస్త ఘాటుగానే స్పందించారు. ఐసిస్ బెదిరింపులకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు.

12 కోట్ల మంది ముస్లింలు ఉన్న భారత్‌లో కేవలం ఐదుగురు మాత్రమే ఐసిస్‌లో చేరారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. మతం ముసుగులో మేధావులను ఐఎస్ఐఎస్ హత్య చేసిందని ఆయన ఆరోపించారు. వేలాది మంది మహిళలను చెరపడుతున్నారని ఆయన తెలిపారు.
ఇస్లాం దేశాలుగా పేరున్న అరబ్ దేశాలే ఐసిస్ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు. అమెరికా విధానాలే ఐసిస్ బలోపేతానికి కారణమయ్యాయన్నారు. భారత్‌లో ప్రతి ముస్లిం దేశాన్ని ప్రేమిస్తున్నాడని తెలిపారు. విధ్వసానికి, మానవ హననానికి పాల్పడడం ఇస్లాంకి వ్యతిరేకమన్నారు.
అంతేకాదు ఐసిస్‌లో యువత ఎవరూ చేరొద్దని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఐసిస్ ట్వీట్లను సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు ఆయనకు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.
All You Need to Know About Doomsday | New Islamic Directions - Imam Zaid Shakir https://t.co/bHyCt7Q88F via @ImamZaidShakir
— Asaduddin Owaisi (@asadowaisi) January 6, 2016 Retweeted Ahmed Mohiuddin (@journopolana):@abotalout @asadowaisi To hell with you Abu Talout & evil ISIS. How... https://t.co/ScTgJ4c5bz
— withAIMIM (@withAIMIM) January 6, 2016 Retweeted Asaduddin Owaisi (@asadowaisi):@abotalout you can dream so keep dreaming Takfiri read @Shaykhabulhuda... https://t.co/PE41zlg3Ui
— withAIMIM (@withAIMIM) January 6, 2016 @abotalout you can dream so keep dreaming Takfiri read @Shaykhabulhuda book on ISIS will bring y out of Darkness of ISIS Allah give Taufeeq
— Asaduddin Owaisi (@asadowaisi) January 6, 2016 @abotalout sir you are a bloody Takfiri if you want to debate on Evil ISIS I am ready you will not be able to counter my Theological Points
— Asaduddin Owaisi (@asadowaisi) January 6, 2016 











Click it and Unblock the Notifications