తెలంగాణకు అశోక్ జగపతి రాజు షాక్: ట్విన్ టవర్స్ ఎత్తుకు నో

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి పౌర విమానయానాల మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పి. అశోక్ గజపతి రాజు షాక్ ఇచ్చారు. హైదరాబాద్‌లో నిర్మించనున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ (ట్విన్ టవర్స్) ఎత్తును పరిమితిని మించి అనుమతించటం సాధ్యం కాదని ఆయన చెప్పారు.

శనివారం మీడియా సమావేశంలో ఆయన ఆ విషయం చెప్పారు. భద్రతా ప్రమాణాల కారణంగా విమానాశ్రయ పరిసర భవనాల ఎత్తు నియంత్రించాల్సి వస్తుందని ఆయన అన్నారు. ట్విన్ టవర్స్‌కు నిర్దేశిత ఎత్తుకు మించి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఒక్కొక్కరికి ఒక్కో విధానం ఉండదని స్పష్టం చేశారు.

Ashok Gajapathi Raju

దేశమంతా ఒకే విధానం అవలంబించాల్సి ఉంటుందని మంత్రి సూచించారు. ఆంధ్రలోని గన్నవరం టెర్మినల్ నిర్మాణం కొనసాగుతోందని, ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా మరో భవనం నిర్మిస్తామని చెప్పారు. రన్ వే విస్తరణకు 700 ఎకరాల భూమి అవసరమంటూ, రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాల భూమి కేటాయించిందని, మరో 300 ఎకరాల భూమి అవసరం ఉందని చెప్పారు.

విమానాశ్రయంలో పనిచేస్తున్న భద్రత, కస్టమ్స్ ఇతర సిబ్బందికి సామాజిక న్యాయశాఖ శిక్షణ, వికలాంగులతో ఎలా వ్యవహరించాలనే తీరుపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రయాణికుల రద్దీనిబట్టి ఆంధ్రలో విమానాల సంఖ్య పెంచుతామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+