అవినీతి కేసు: తెలంగాణలో లోకాయుక్త పుత్రుడు అశ్విన్ రావ్ అరెస్టు
బెంగళూరు/హైదరాబాద్: కర్ణాటక లోకాయుక్తలో జరిగిన అవినీతి కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. లోకాయుక్త న్యాయమూర్తి వై. భాస్కర్ రావ్ కుమారుడు వై. అశ్విన్ రావ్, అతని వ్యక్తిగత సహాయకుడు మనోజ్ ను అరెస్టు చేశారు.
లోకాయుక్తలో రూ. ఒక కోటి లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక బృందం పోలీసులకు అప్పగించారు. కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులు జులై 25వ తేది లోపు విచారణకు హాజరు కావాలని అశ్విన్ రావ్ కు సూచించారు.
అయితే అశ్విన్ రావ్ విచారణకు హాజరుకాలేదు. పోలీసులు బెంగళూరుతో పాటు తెలంగాణ, చెన్నయ్ లో దర్యాప్తు చేశారు. డీసీపీ లాబూరామ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం పోలీసులు తెలంగాణలో దర్యాప్తు చేసి అశ్విన్ రావ్ గురించి వివరాలు సేకరించారు.

రంగారెడ్డి జిల్లాలోని ఇంటిలో అశ్విన్ రావ్ తలదాచుకున్నాడని వెలుగు చూడటంతో అతనిని అరెస్టు చేశారు. ఆదివారం లోకాయుక్త జాయింట్ కమిషనర్ (పీఆర్ఓ) సయ్యద్ రియాజ్ ను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
న్యాయస్థానం అనుమతితో సయ్యద్ రియాజ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. అశ్విన్ రావ్, మనోజ్ లను న్యాయస్థానం ముందు హాజరుపరిచి విచారణ చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications