వివస్త్రను చేసి వీడియో తీశాడు, పలుమార్లు అత్యాచారమిలా, భర్త ఇలా...

నిర్మాతగా అవకాశం ఇప్పిస్తానని ఓ వివాహితను మోసం చేశాడు ఓ అసిస్టెంట్ డైరెక్టర్.అంతేకాదు ఆమెపై పలు మార్లు అత్యాచారం చేశాడు. బ్లాక్ మెయిల్ చేస్తూ తన అవసరం తీర్చుకొంటున్నాడు.నిందితుడిని పోలీసులు అరెస్టు

హైదరాబాద్:ఫేస్ బుక్ లో ఓ వివాహితన పరిచయం చేసుకొని నిర్మాతను చేస్తానని నమ్మించి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ అసిస్టెంట్

డైరెక్టర్.అయితే బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.

విశాఖపట్టణం శీలానగర్ కు చెందిన 32 ఏళ్ళ వివాహిత రెండేళ్ళ క్రితం అమీర్ పేట మధురానగర్ లో ఉండే ముమ్మిడి కార్తికేయకు ఫేస్ బుక్ లో పరిచయమైంది.

తరచూ ఫేస్ బుక్ లో చాటింగ్ చేసేవారు. దీంతో వీరిద్దరూ ఫేస్ బుక్ నుండి వాట్సాప్ లో ఛాటింగ్ చేసేవరకు పరిచయం పెరిగింది.గతంలో తాను పలు చిత్రాలకు సహయ దర్శకుడిగా పనిచేశానని కార్తికేయ ఆమెను నమ్మించాడు.

నారా రోహిత్ తో తీసే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్టు ఆయన ఆమెకు చెప్పాడు.సినీ రంగంపై ఆమెకు ఆసక్తి ఉంది. నిర్మాతగా ఉండాలని ఆమెను కార్తికేయ కోరాడు.అయితే తన వద్ద డబ్బులు లేదని స్థలం మాత్రమే ఉందని ఆమె చెప్పింది.

స్థలం పత్రాలు ఇస్తే ఫైనాన్షియర్లతో రూ.3 కోట్ల రుణం ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు కార్తికేయ. నిజమని నమ్మిన ఆమె పత్రాలిచ్చేందుకు అంగీకరించింది.
గత ఏడాది జూలై 24వ,తేదిన కార్తికేయ వైజాగ్ వెళ్ళి వాటిని తీసుకొచ్చాడు.ఫైనాన్షియర్లతో మాట్లాడేందుకు హైద్రాబాద్ కు రమ్మని కోరాడు. దీంతో ఆమె ఆగష్టులో హైద్రాబాద్ కు వచ్చింది.

రాయదుర్గం మారుతినగర్ లో ఆమెను ఉంచిన కార్తికేయ...పార్టీ ఉందంటూ తన స్నేహితులు గోవిందరాజు, పోకూరి సుశావంత్, గీతికారెడ్డిని పిలిపించాడు. వారు వెళ్ళిన తర్వాత శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఆమెకు ఇచ్చాడు.

rape

ఆమె మత్తులో ఉన్న సమయంలో ఆమెను వివస్త్రను చేసి ఆ దృశ్యాలను వీడియో తీశాడు. ఇది గమనించిన బాధితురాలు వారించింది.

అయితే వినకుండా తుపాకీతో బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.మరుసటిరోజే ఆమెను పంపించివేశాడు. అయితే తరచూ హైదరాబాద్ లో రావాలని డిమాండ్ చేసేవాడు. రాకుండే వీడియో దృశ్యాలను ఆమె భర్తకు పంపిస్తానని బెదిరించాడు.

ఈ రకంగా పలుమార్లు ఆమెను హైద్రాబాద్ కు రప్పించి అత్యాచారానికి పాల్పడేవాడు.బాధితురాలి ఫోన్ కు వస్తోన్న మేసేజ్ లను చూసిన భర్త ఆమెను నిలదీశాడు. దీంతో బాధితురాలు అసలు విషయం చెప్పేసింది.

శుక్రవారం నాడు దంపతులిద్దరూ బోడుప్పల్ లోని తన స్నేహితుల ఇంటికి వచ్చారు. కార్తికేయను అక్కడికి పిలిపించి వీడియోల గురించి నిలదీశారు. అయితే అక్కడి నుండి అతను పారిపోయాడు. బాధితురాలు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది. గురువారం నాడు మధురానగర్ లో నిందితుడు కార్తికేయను పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+