బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్​ హోం కార్యక్రమం: సీఎం రేవంత్ సహా ప్రముఖుల హాజరు

హైదరాబాద్: నగరంలోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. శీతాకాలం విడిది కోసం హైదరాబాద్​ వచ్చిన రాష్ట్రపతి శుక్రవారం రాత్రి తేనీటి విందు ఇచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే దంపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర మంత్రులు, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి కూడా విందులో పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీఎస్ శాంతికుమారి తదితరులు రాష్ట్రపతి ఎట్ హోంకు హాజరయ్యారు.

At Home program at Rashtrapati Nilayam in Hyderabad; governor and cm, other political leaders participated

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతి ఒక్కరిని కలిసి.. కాసేపు మాట్లాడారు. అనంతరం అందరూ రాష్ట్రపతితో ఫొటోలు దిగారు. ఎట్ హోం కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ మారాయి. కాగా, రాష్ట్రపతి ముర్ముతో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ప్రత్యేకంగా కలిసి ఫొటో దిగారు.

కాగా, డిసెంబర్ 18న హైదరాబాద్ నగరంలోని రాష్ట్రపతి నిలయానికి శీతకాల విడది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చారు. ఐదు రోజులపాటు అంటే డిసెంబర్ 23 వరకు ఆమె ఇక్కడే ఉండనున్నారు. డిసెంబర్ 23న ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. కాగా, శీతకాల విడదికి హైదరాబాద్ నగరానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రంలో జరిగిన పలు కార్యక్రమల్లో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+