పాఠశాల ప్రిన్సిపాల్.. పాడు పని! పాఠశాలలోనే మద్యం తాగి ఓ బాలికపై..
అతడో పాఠశాల ప్రిన్సిపాల్. పాఠశాలలోనే మద్యం తాగి ఓ బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఈ ఘటన ఈసీఐఎల్ ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్-2లో చోటు చేసుకుంది.
హైదరాబాద్ : అతడో పాఠశాల ప్రిన్సిపాల్. పాఠశాలలోనే మద్యం తాగి ఓ బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఈ ఘటన ఈసీఐఎల్ ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్-2లో చోటు చేసుకుంది.
ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్-2 ప్రిన్సిపాల్ కె.మహాపాత్ర(54) ఈ దురాగతానికి ఒడిగట్టాడు. గత అక్టోబరు 10న మధ్యాహ్నం తొమ్మిదో తరగతి విద్యార్థిని(14)ని మహాపాత్ర తన క్యాబిన్‌కు పిలిచాడు.

ఆ బాలిక గదిలోకి రాగానే తలుపులు మూసి ముద్దు పెట్టుకున్నాడు. ఈ హఠాత్సరిణామంతో షాక్ తిన్న బాలిక కేకలు వేయడంతో ప్రిన్సిపాల్ కె.మహాపాత్ర కంగారుపడి వెంటనే తలుపులు తెరిచాడు.
జరిగిన విషయం ఎవరికీ చెప్పొద్దంటూ ఆ విద్యార్థినితో ఒట్టు పెట్టించుకొని పంపించివేశాడు. అయితే ఇంటికెళ్లాక బాలిక జరిగినదంతా తల్లిదండ్రులకు వివరించింది. ఆమె తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని, ప్రిన్సిపాల్ మహాపాత్రను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.












Click it and Unblock the Notifications