హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్: మహేష్ కత్తి ఫ్యామిలీ నేపథ్యం ఇదీ...

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తనపై జరిగిన కోడి గుడ్ల దాడి వ్యవహారంపై సినీ క్రిటిక్ మహేష్ కత్తి పోలీసు స్టేషన్‌కు ఎక్కారు. తనపై హైదరాబాదులోని మాదాపూర్ ప్రాంతంలో కోడి గుడ్లతో దాడి జరిగిందని మహేష్ కత్తి ఆరోపిస్తున్నారు.

తనపై కోడిగుడ్లతో దాడి చేసి అవమానించారని ఆయన శుక్రవారం మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు కింద ఫిర్యాదు చేశారు. తనపై దాడి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పనే అని గట్టిగా నమ్ముతున్నట్లు ఆయన తన ఫిర్యాదులో రాశారు.

 తనకూ వారికి ఇలా గొడవ అంటూ...

తనకూ వారికి ఇలా గొడవ అంటూ...

తనకూ పవన్ కల్యాణ్ అభిమానులక మధ్య నాలుగు నెలలుగా సోషల్ మీడియాలో వార్ నడుస్తోందని, అందువల్ల తనపై పవన్ కల్యాణ్ అభిమానులే దాడి చేసి ఉంటారని విశ్వసిస్తున్నానని ఆయన తన పిర్యాదులో చెప్పారు.

Recommended Video

పవన్ కళ్యాణ్‌పై మహేష్ కత్తి రెచ్చిపోవడం వెనుక ఉన్నది ఆయనా? YS Jagan Behind Mahesh Kathi | Oneindia
కత్తి మహేష్‌ది చిత్తూరు జిల్లా

కత్తి మహేష్‌ది చిత్తూరు జిల్లా

కత్తి మహేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా ఎలమంద గ్రామంలో జన్మించారు. తండ్రి కత్తి ఓబులేసు గ్రామంలోనే ఉంటున్నారు. తల్లి కత్తి సరోజమ్మ ఏడాదిన్నర క్రితం మరణించారు. అన్న రవికుమార్ బెంగళూర్‌లో సాప్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. చెల్లె వాణిశ్రీ సికింద్రాబాదులో న్యూట్రినిస్టుగా పనిచేస్తున్నారు.

మహేష్ కత్తి బార్య లక్నోలో..

మహేష్ కత్తి బార్య లక్నోలో..

కత్తి మహేష్ భార్య సోనాలి. ఆమె కోల్‌కతాకు చెందినవారు. కత్తి మహేష్, సొనాలీలది ఇంటర్నెట్ ప్రేమ. మహేష్ కత్తి కుామారుడికి ఎనిమిదేళ్లు. అతను తల్లి వద్దే ఉన్నాడు. మహేష్ కత్తి మాస్ కమ్యూనికేషన్స్‌లో ఎంఎ చేసి సినీ రంగంలో స్థిరపడ్డారు.

 మహేష్ కత్తిపై కోడిగుడ్ల దాడి...

మహేష్ కత్తిపై కోడిగుడ్ల దాడి...

కారులో వెళ్తుండగా తనపై కోడిగుడ్లతో దాడి చేశారని మహేష్ కత్తి ఆరోపిస్తున్నారు. అది పవన్ కల్యాణ్ అభిమానుల పనే అని అంటున్నారు.అయితే, కోడిగుడ్లతో దాడి చేశారనేది మహేష్ కత్తి ఆడుతున్న నాటకంగా పవన్ కల్యాణ్ అభిమానులు అభివర్ణిస్తున్నారు.

English summary
Mahesh Kathi has filed SC,ST case at Madhapur police station in Hyderanad alleged attack by the Jana Sena chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X