హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో రూ. 600 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చిన అట్టెరో, 300 మందికి ఉపాధి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ సిద్ధమైంది. రూ. 600 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఈ-వేస్ట్ రీసైక్లింగ్ సంస్థ అట్టెరో ఇండియా తెలిపింది. కొత్త ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా 300 మందికి ప్రత్యక్షంగా, మరికొంతమందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని పేర్కొంది.

హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో సోమవారం అట్టెరో ఇండియా ప్రతినిధులు భేటీ అయ్యారు. అనంతరం ఈ మేరకు ప్రకటించారు. అట్టెరో ఇండియా నిర్ణయంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఎర్రతివాచీ పరుస్తోందని వ్యాఖ్యానించారు.

 Attero India to invest Rs 600 crore to set up recycling unit in Telangana

ఇటీవల రెండు సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. లారస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీలు జినోమ్ వ్యాలీలో రూ. 700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపాయి.

ఇందులో రూ. 400 కోట్లతో తయారీ పరిశ్రమను గ్రాన్యూల్స్ ఇండియా నెలకొల్పనుంది. లారస్ ల్యాబ్ కూడా తయారీ రంగంలోనే రూ. 300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ సంస్థల పెట్టుబడితో రాష్ట్రంలో 1750 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

English summary
Attero India to invest Rs 600 crore to set up recycling unit in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X