తెలంగాణలో ఆరమ్ ఈక్విటీ భారీ పెట్టుబడులు: హైదరాబాద్‌లో ఏఐ ఆధారిత గ్రీన్ డేటా సెంటర్
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. తాజాగా, ప్రఖ్యాత ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ (Aurum Equity Partners) తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ లో 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3350 కోట్లు) పెట్టుబడులకు సిద్ధపడింది. హైదరాబాద్‌లో నెక్స్ట్-జనరేషన్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- పవర్డ్ గ్రీన్ డేటా సెంటర్ నిర్మించనున్నట్లు ప్రకటించింది. దశలవారీగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు Aurum Equity సంస్థ తెలిపింది.
అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ఆరమ్ ఈక్విటీ (Aurum Equity) సీఈవో, ఛైర్మన్ వెంకట్ బుస్సా సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణలో తమ విస్తరణ ప్రణాళికలతో పాటు భారీ పెట్టుబడులను కంపెనీ ప్రకటించింది. గత ఏడాది ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ దాదాపు రూ.400 కోట్ల పెట్టుబడులకు తమ వార్షిక ప్రణాళికను ప్రకటించింది. ఇప్పుడు తమ ప్రణాళికలను భారీగా విస్తరించింది. 100 మెగావాట్ల అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ను స్థాపించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి దాదాపు రూ.3350 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడింది.

ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఏఐ ఆధారిత గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవటం సంతోషంగా ఉందన్నారు. దీంతో భారీగా ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు.ఆరమ్ ఈక్విటీ (Aurum Equity) సంస్థ కొత్త డేటా సెంటర్ ఏర్పాటును మంత్రి శ్రీధర్‌బాబు స్వాగతించారు. ఇప్పటికే డేటా సెంటర్ హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్ కు ఈ పెట్టుబడులు మరింత వృద్ధిని తెచ్చిపెడుతాయని అన్నారు.
తమ సంస్థ నెలకొల్పే అధునాతన డేటా సెంటర్ తో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ సేవల మధ్య అంతరం తగ్గుతుందని ఆరమ్ ఈక్విటీ పార్ట్‌నర్స్ సీఈవో, ఛైర్మన్ వెంకట్ బుస్సా అన్నారు. ఈ-సేవ, ఈ-పేమెంట్, ఈ -ఎడ్యుకేషన్ వంటి ప్రభుత్వ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
Excited to visit @Google headquarters in California and meet leaders to talk about tech, AI and Skilling and how that can help the State of #Telangana take the next leap : @revanth_anumula.#InvestInTelangana #AI #TelanganaTheFutureState pic.twitter.com/UYq4vfe44d
— Telangana CMO (@TelanganaCMO) August 10, 2024
గూగుల్ ఆఫీసుకు సీఎం రేవంత్ బృందం
తెలంగాణ ఆర్థికాభివృద్ది, ఉద్యోగాల కల్పనకు తోడ్పడే పెట్టుబడుల సేకరణ, ఒప్పందాల నిమిత్తం అమెరికాలో పర్యటిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలిఫోర్నియాలోని మౌంటేన్ వ్యూలో గల ప్రఖ్యాత గూగుల్ (Google) సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి వెంట పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
తెలంగాణలో టెక్ సేవల విస్తృతి, ఏఐ సిటీ నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు తదితర ప్రాజెక్టుల్లో భాగం పంచుకునే విషయమై గూగుల్ (Google) సంస్థ ఉన్నతాధికారులతో తెలంగాణ బృందం చర్చలు జరిపింది.












Click it and Unblock the Notifications