రూ.500, రూ.1000 నోట్లు ఇచ్చేందుకు అక్కడ ఈ రోజే చివరి రోజు, ఆ తర్వాత..

రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను పెట్రోల్ బంకుల వంటి వాటిల్లో ఉపయోగించడానికి ఈ రోజే (గురువారం) చివరి రోజు. రద్దయిన నోట్లు ఉంటే, బయట ఉపయోగించాలనుకుంటే ఈ రోజు రాత్రి వరకే ఉపయోగించవలసి ఉంటుంది.

న్యూఢిల్లీ/హైదరాబాద్: రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను పెట్రోల్ బంకుల వంటి వాటిల్లో ఉపయోగించడానికి ఈ రోజే (గురువారం) చివరి రోజు. రద్దయిన నోట్లు ఉంటే, బయట ఉపయోగించాలనుకుంటే ఈ రోజు రాత్రి వరకే ఉపయోగించవలసి ఉంటుంది. ఆ తర్వాత అవి తీసుకోరు!

పెట్రోలు బంకులు, మెడికల్ షాపులు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు తదితర చోట్ల రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను ఈ నెల 24వ తేదీ వరకు ప్రభుత్వం అనుమతించింది. అంటే ఈ రోజు రాత్రి వరకే ఆయా చోట్ల ఆ నోట్లను తీసుకుంటారు. ఆ తర్వాత తీసుకోరు.

Today is The Last Day To Use Your Rs 500-1000 Notes in Public Utilities

ఈ రోజు దాటితే, మీ వద్ద ఉన్న రద్దయిన నోట్లను బ్యాంకులలో డిపాజిట్ చేయడం లేదా బ్యాంకులలో మార్చుకోవడం మాత్రమే చేయవచ్చు. బయట మాత్రం వాటిని ఎవరు తీసుకోరు. డిసెంబర్ 30వ తేదీ వరకు మీరు బ్యాంకులలో రద్దయిన నోట్లను డిపాజిట్ చేయవచ్చు.

రూ.500, రూ.1000 నోట్లను ప్రభుత్వం నవంబర్ 8వ తేదీన రద్దు చేసింది. ప్రధాని మోడీ ఆ రోజు రాత్రి ప్రకటించారు. ఆ మరుసటి రోజు నుంచి వాటిని ఎవరూ తీసుకోవడం లేదు. అయితే, ప్రభుత్వ కార్యాలయాలు, పెట్రోలు బంకులు వంటి చోట తీసుకుంటున్నారు.

ఇప్పటి దాకా పెట్రోలు బంకులు, ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వే టిక్కెట్ కౌంటర్, పబ్లిక్ ట్రాన్సుపోర్ట్, ఎయిర్ పోర్టు, పాల బూత్‌లు, స్మశానాల తదితర చోట్ల తీసుకున్నారు.

తొలుత పై ప్రాంతాల్లో 72 గంటల పాటు తీసుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత సామాన్యుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దానిని నవంబర్ 24వ తేదీ వరకు పొడిగించింది.

అంతేకాదు, మెట్రో రైలు ట్కికెట్స్, హైవే అండ్ రోడ్ టోల్, మెడిసిన్స్ కొనేందుకు, ప్రయివేటు, ప్రభుత్వ ఆసుపత్రులు, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్స్, రైల్వే కేటరింగ్, ఎలక్ట్రిసిటీ బిల్స్, వాటర్ బిల్స్ తదితర చోట్ల రద్దయిన నోట్లను వినియోగించవచ్చునని చెప్పింది. తొలుత 72 గంటల నుంచి ఆ తర్వాత నవంబర్ 24వ తేదీకి పొడిగించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ రోజు అర్ధరాత్రి నుంచి బ్యాంకులలోను మార్పిడి ఉండదు. కేవలం డిపాజిట్ చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+