సికింద్రాబాద్ నుంచి వారణాశి- అయోధ్య స్పెషల్: ఏపీలో హాల్ట్ స్టేషన్లు
Secunderabad-Saraswati Pushkaralu express: సరస్వతి పుష్కరాల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. అయోధ్య- కాశి (వారణాశి) పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. తొమ్మిది రాత్రులు/ 10 పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. మే 8వ తేదీన సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్- 460, 3ఏసీ- 206, 2ఏసీ- 52.

సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మధిర, ఏపీలో విజయవాడ, తెనాలి, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్‌లల్లో ఈ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ సౌకర్యం ఉంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు.
ఈ ప్యాకేజీలో పూరీ- గయ- వారణాశి- అయోధ్య, ప్రయాగ్‌రాజ్ ఉన్నాయి. పూరీలో జగన్నాథుడి ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయాలను దర్శించుకోవచ్చు. గయలో ప్రఖ్యాత విష్ణుపాద ఆలయంలో పూజలు చేయవచ్చు. వారణాశి- కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయాల్లో పూజల్లో పాల్గొనవచ్చు. అక్కడి కారిడార్ కూడా ఈ టూర్ ప్యాకేజీలో చేర్చారు.
అయోధ్యలో చారిత్రాత్మక బాలరాముడి ఆలయం, హనుమాన్ గర్హి ఆలయాలను యాత్రీకులు దర్శించుకోవచ్చు. అక్కడి సరయూ నది హారతిలో పాల్గొనవచ్చు. ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించే అవకాశం ఉందీ టూర్ ప్యాకేజీ ద్వారా. ప్రయాగ్‌రాజ్‌తో ఈ ప్యాకేజీ టూర్ ముగుస్తుంది. అక్కడి నుంచి మళ్లీ సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్.
ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 16,800 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 15,700 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీ (3ఏసీ)లో పెద్దలకు 26,600, పిల్లలకు 25,300 రూపాయలు, కంఫర్ట్ కేటగిరీ (2ఏసీ)లో పెద్దలకు 34,900, పిల్లలకు 33,300 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.
Make this auspicious time of Saraswati Pushkaralu memorable with this 9N/10D Ayodhya Kashi Punya Kshetra Yatra aboard the Bharat Gaurav Tourist Train.
— IRCTC Bharat Gaurav Tourist Train (@IR_BharatGaurav) April 22, 2025
Book Now: https://t.co/PopNFb46Bm
(Package Code = SCZBG41)#BharatGauravTouristTrain #Odisha #Bihar #UttarPradesh pic.twitter.com/b89M2HYmGx












Click it and Unblock the Notifications