అసెంబ్లీ బరిలో అజారుద్దీన్, ఆ సీటుపై గురి - అక్కడే అసలు ట్విస్ట్..!?

టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ వచ్చే ఎన్నికల్లొ పోటీకి సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న అజాహరుద్దీన్ ఎమ్మెల్యేగా సభలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. కానీ, అజాహర్ కోరుకున్న విధంగా జరిగే పరిస్థితి కనిపించటం లేదు. అజాహర్ ను తిరిగి పార్లమెంట్ కే పంపాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు. దీంతో, ఇప్పుడు అజాహరుద్దీన్ రాజకీయంగా ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

అజారుద్దీన్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో కొంత కాలంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి పోటీకి సిద్దం అవుతున్నారు. అజారుద్దీన్ 2009 లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యునిగా ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతగా అసెంబ్లీకి ఎన్నిక కావాలని కోరుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా నగర పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం తనకు తానుగా ప్రకటించుకున్నారు. అక్కడ సామాజిక సమీకరణాలు తనకు కలిసి వస్తాయని భావిస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గానికి వెళ్లిన అజారుద్దీన్ కు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి.

Azharuddin

జూబ్లీహిల్స్ లో పర్యటించిన సమయంలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి మద్దతు దారుల నుంచి నిరసన వ్యక్తం అయింది. నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ప్రజలు కొత్త ముఖాన్ని కోరుకుంటున్నారంటూ.. అజారుద్దీన్ చేసిన ప్రకటన వివాదానికి కారణమైంది. జూబ్లీహిల్స్‌తో తనకు 16 ఏళ్ల అనుబంధం ఉందని పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి చెబుతున్నారు. దీంతో, విష్ణు మద్దతు దారులు అజాహరుద్దీన్ పర్యటనకు అభ్యంతరం చెప్పారు. విష్ణు కూడా పార్టీ హైకమాండ్‌పై కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కొద్ది రోజుల క్రితం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తోనూ విష్ణు సమావేశమయ్యారు. తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం పైన వివరణ ఇచ్చారు.

ఇప్పుడు విష్ణు పార్టీ అభ్యర్ధిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న సమయంలో అజాహరుద్దీన్ ఎంట్రీ మరింత కాక పెంచింది. తాజాగా అజారుద్దీన్‌ నియోజకవర్గ పరిధిలోని సోమాజీ గూడ, ఎర్రగడ్డ, బోరుబండ ప్రాంతాల్లో పర్యటించారు. పార్టీ కేడర్ తో కలిసి ఛాయ్ పే చర్చ నిర్వహించారు. స్థానికులతోనూ మమేకం అయ్యే ప్రయత్నం చేసారు. ఇదంతా విష్ణు వర్గానికి నచ్చటం లేదు. పార్టీ హైకమాండ్ ఈ విషయంలో ఇప్పుడు ఏం చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. అజాహరుద్దీన్ ను సికింద్రాబాద్ ఎంపీగా బరిలోకి దింపాలని మరి కొందరు నేతలు సూచిస్తున్నారు. దీంతో, పార్టీ నిర్ణయం కీలకం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+