Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీటెక్ చేసి భర్త కోసం చైన్ స్నాచింగ్.. స్టోరీ ఏంటంటే..?

బీటెక్ పూర్తి చేసిన ఓ 23 ఏళ్ల యువతి చైన్ స్నాచర్ గా మారింది. తన భర్త అప్పులను తీర్చేందుకు దొంగగా మారింది. జనవరి 12న ఓ వృద్ధురాలి నుంచి బంగారపు చెైన్ ను దొంగిలించబోయి పోలీసులకు చిక్కింది. ఈ ఘటన హైదరాబాద్ లోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వెంటనే వృద్ధురాలు చాకచక్యంగా వ్యవహరించి చైన్ స్నాచర్ ను పట్టుకుంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు చైన్ స్నాచర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు.

హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోట కాలనీ అవంతీ నగర్ వద్ద జరిగింది. బోరబండకు చెందిన అమితా రెడ్డి అనే మహిళ బీటెక్ పూర్తి చేసింది. తన భర్తకు ఉన్న అప్పులను తీర్చేందుకు చైన్ స్నాచర్ గా మారింది. ఈ క్రమంలో ఓ 60 ఏళ్ల వృద్ధురాలు తోట కాలనీ అవంతీ నగర్ లోని తన అపార్ట్ మెంట్ లోకి వెళ్లేందుకు లిఫ్ట్ ముందు నిల్చొన్న క్రమంలో అమితా రెడ్డి.. వృద్ధురాలి చైన్ ను కొట్టేసేందుకు యత్నించింది.

ఈ క్రమంలో అప్రమత్తమైన వృద్ధురాలు వెంటనే కేకలు వేయడంతో పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు నిందితురాలిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పాడు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఆ మహిళ రాజేశ్ అనే వ్యక్తిని రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నట్లు తేలింది. వారికి ఓ పాప ఉన్నట్లు సమాచారం. భర్త రాజేశ్ కు ఉన్న అప్పులను తీర్చేందుకు ఆమె చైన్ స్నాచర్ గా మారినట్లు విచారణలో తేలింది.

మరో ఘటనలో సామాజిక మాధ్యమాల్లో పురుషులకు వల వేసి శృంగార చేసి ఆ వీడియోలతో బ్లాక్‌ మెయిల్ చేస్తున్నారు దంపతులు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావు పేటకు చెందిన 31 ఏళ్ల ఓ వ్యక్తి కరీంనగర్‌ లో స్థిరపడి మార్బుల్ వ్యాపారం, ఇంటీరియర్ డెకరేషన్ చేసేవాడు. ఆయనకు మంచిర్యాలకు చెందిన మహిళ (29)తో వివాహమైంది.. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో రుణంతో కొన్న ప్లాటు ఈఎంఐలు కట్టడం ఇబ్బందిగా మారడంతో.. సామాజిక మధ్యమాల ద్వారా మగవాళ్లను ఆకర్షించేలా పోస్టులు పెట్టడం ప్రారంభించారు భార్యాభర్తలు. కొందరు వ్యాపారులు, యువకులు వారి వలలో పడ్డారు. ఆమె వారిని తన అపార్ట్‌ మెంట్ కు పిలిచి.. వారితో సన్నిహితంగా ఉండగా భర్త రహస్యంగా వీడియోలు తీసేవాడు. ఆ తర్వాత బాధితులకు ఫోన్ చేసి వీడియోలు అందరికీ చూపిస్తామంటూ బ్లాక్‌ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకున్నారు దంపతులు.

B Tech Graduate Turns to Chain Snatching to Clear Husband s 5 Lakh Debts in Hyderabad

ఇలా మూడేళ్లలో సుమారు 100 మందికి పైగా పురుషులను బెదిరించి డబ్బులు వసూలు చేశారు. కరీంనగర్‌ కు చెందిన ఓ లారీ వ్యాపారిని సైతం బ్లాక్‌ మెయిల్ చేసి రూ.13 లక్షలు దండుకొని మరో సారి రూ.5 లక్షలు కావాలి అనడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ బాధితుడు. దీంతో ఆ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+