25 వరకు బడ్జెట్ సెషన్ .. రేపు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
హైదరాబాద్ : అసెంబ్లీలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టాక .. స్పీకర్ చాంబర్ లో బీఏసీ సమావేశం జరిగింది. సభ ఎన్నిరోజులు నిర్వహించాలి, ఏయే అంశాలు చర్చించాలనే అంశంపై చర్చ జరిగింది. సమావేశానికి పార్టీ ఎల్పీ నేతలు హాజరయ్యారు.

25 వరకు సెషన్
మరో రెండు రోజుల సభ నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. శనివారం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. అధికార పార్టీ నుంచి మాజీ మంత్రి పద్మారావు ఒక్కరి పేరే వినిపిస్తోంది. దీంతో ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. ఆ తర్వాత బడ్జెట్ పై చర్చను ప్రారంభిస్తారు స్పీకర్. వివిధ పక్షాల నేతలు పద్దుపై తమ వాణి వినిపిస్తారు. ఆదివారం సభకు సెలవు ఉండటంతో తిరిగి సోమవారం సెషన్ ప్రారంభమవుతోంది.
ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం
తిరిగి సోమవారం బడ్జెట్ పై చర్చ జరుగుతోంది. ఆ తర్వాత ఆర్థికమంత్రి హోదాలో సీఎం కేసీఆర్ పద్దుపై సమాధానం చెపుతారు. బడ్జెట్ ను ఆమోదించాలని కోరడంతో సభ్యుల వినతి మేరకు స్పీకర్ ఆమోదిస్తారు. ఆ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లును కూడా సభలో ప్రవేశపెడతారు. బిల్లుకు సభ ఆమోదం తెలుపడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మనుగడలోకి వస్తోంది.












Click it and Unblock the Notifications