దేశప్రధాని మోడీ కాదు కేడీ; బండి సంజయ్ నిజం తెలుసుకో: టీఆర్ఎస్ నేతల ధ్వజం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువగా మారాయి. తాజాగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశానికి ప్రధాని మోడీ కాదు కేడి అంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. కనకపు సింహాసనం మీద శునకమును కూర్చుండబెట్టినట్టుగా ఉందని మోడీని దుయ్యబట్టారు. ప్రధానమంత్రిపై దేశ ప్రజలకు ఉన్న గౌరవం పోయిందని, ఏ ఒక్క రాష్ట్రానికి ప్రధానమంత్రి న్యాయం చేయలేదని బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు.

తెలుగురాష్ట్రాలకు నయా పైసా ఇవ్వలేదు ..సిగ్గు లేని వ్యక్తి మోడీ : బాజిరెడ్డి గోవర్ధన్

తెలుగురాష్ట్రాలకు నయా పైసా ఇవ్వలేదు ..సిగ్గు లేని వ్యక్తి మోడీ : బాజిరెడ్డి గోవర్ధన్

ఏడేళ్లలో కేంద్రం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక నయా పైసా కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. తలుపులు బిగించి బిల్లు మంజూరు చేశారని పేర్కొన్న సిగ్గు లేని వ్యక్తి మోడీ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తెలంగాణా అభివృద్ధి చెందుతుంటే పీఎం మోడీ ఓర్వలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

కెసిఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి జై తెలంగాణ అనిపించి తెలంగాణ రాష్ట్ర కల సాకారం చేశారని బాజిరెడ్డి గోవర్దన్ పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు . బిజెపి అంటేనే ప్రజలు విసిగి చెందుతున్నారని, భవిష్యత్తులో బీజేపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు.

బీజేపీ నేతలు రోడ్లపైకి వచ్చి బరితెగించి మాట్లాడుతున్నారు: బాజిరెడ్డి గోవర్ధన్

బీజేపీ నేతలు రోడ్లపైకి వచ్చి బరితెగించి మాట్లాడుతున్నారు: బాజిరెడ్డి గోవర్ధన్

నాడు ఏపీ తెలంగాణ రాష్ట్రాల విభజనకు సుష్మాస్వరాజ్ సపోర్ట్ చేసిందని పేర్కొన్న ఆయన ప్రధాని మోడీ మాటలతో ఆమెను అవమాన పరుస్తున్నారు అని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీని బహిష్కరించారని పేర్కొన్న ఆయన బీజేపీ నేతలు రోడ్లపైకి వచ్చి బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బుర్ఖాలు ధరించవద్దని చెబుతూ కుల,మతాలను రెచ్చగొట్టి ప్రయత్నం చేస్తున్నారని బిజెపిపై విమర్శలు గుప్పించారు బాజిరెడ్డి గోవర్ధన్ .

కేసీఆర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలు నిరాధారం: వినోద్ కుమార్

కేసీఆర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలు నిరాధారం: వినోద్ కుమార్


ఇదిలా ఉంటే తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను టార్గెట్ చేశారు . తెలంగాణ బిల్లును ఆమోదించినప్పుడు కెసిఆర్ సభలో లేరని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు వినోద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.

బిజెపి నాయకుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అబద్ధమని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లును సభలో ప్రవేశ పెట్టిన రోజు ఉదయం 8.30 గంటల నుండి కేసీఆర్ తో సహా టీఆర్ఎస్ ఎంపీలు అందరూ పార్లమెంటుకు చేరుకున్నారని, అప్పట్లో తాను ఎంపీగా లేనప్పటికీ ఆయన పార్లమెంటుకు వెళ్లారని వినోద్ కుమార్ తెలిపారు.

తెలంగాణా బిల్లు కోసం కేసీఆర్ ఢిల్లీలో మకాం వేశారు: వినోద్ కుమార్

తెలంగాణా బిల్లు కోసం కేసీఆర్ ఢిల్లీలో మకాం వేశారు: వినోద్ కుమార్

పది రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ రాజకీయ పార్టీల ఎంపీలను కేసీఆర్ కలిశారని, ఈ విషయాలు బండి సంజయ్ కు తెలియకుంటే, ఆ సమయంలో సభలో ఉన్న బీజేపీ ఎంపీలను సంప్రదించి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలని వినోద్ కుమార్ పేర్కొన్నారు. తెలిసీ తెలియకుండా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+