Balagam Mogilaiah: ఆపదలో బలగం మొగిలయ్య.. ఆదుకోవాలని విజ్ఞప్తి..
బలగం.. బంధాలను మరోసారి గుర్తుకు తెచ్చిన సినిమా. ముఖ్యంగా ఈ చిత్రం చివరలో మొగిలయ్య, కొమురమ్మ పాడిన పాట ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. "పచ్చని సంసారమురా నా కొడుక మీరు ఇచ్చుకపోవద్దురా నా కొడక" అంటూ కొమురయ్య, కొమురమ్మలు పాడిన పాట ప్రతి ఒక్కరిని కదిలించింది. ప్రతి మనస్సు కదిలించిన మొగిలయ్య ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు. మొగిలయ్య కిడ్నిలు చెడిపోయాయి. ప్రస్తుతం ఆయన రోజూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. తాజాగా ఆయనకు కళ్లు కూడా కనబడడం లేదు. ప్రస్తుతం మొగిలయ్య హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.
తమకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని.. తమను ఆదుకోవాలని మొగిలయ్య కోరుతున్నారు. తనకు ఇప్పటికే లక్షల్లో డబ్బు ఖర్చు అయిందని చెప్పారు. తమకు అవకాశం ఇచ్చిన బలగం దర్శకుడు వేణుకు ధన్యవాదాలు తెలిపారు. తమకు సహకరిస్తున్న మంత్రి హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఇబ్బందుల్లో తమను ఆదుకోవాలని మొగిలయ్య భార్య కొమురమ్మ కోరుతున్నారు.

తాజాగా మొగిలయ్య దీనస్థితి గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆయనకు తిరిగి కంటి చూపు వచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారట. ఈక్రమంలో బలగం దర్శకుడు వేణుకి ఫోన్ చేసి మొగిలయ్య కంటి చూపు కోసం ఎంత ఖర్చైనా తాను భరిస్తానని ఆయనకు కంటి చూపు వచ్చేలా చేద్దామని భరోసా ఇచ్చినట్లు సమాచారం. దీంతో వెంటనే ఈ విషయాన్ని వేణు మొగిలయ్య దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications