రికార్డు సృష్టించిన బాలాపూర్ లడ్డూ..ఎంతంటే..?
బాలాపూర్ గణేష్ ఉత్సవాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన లడ్డూ వేలం ప్రక్రియ ఈరోజు ముగిసింది. అంచనాలకు మించి ఈసారి లడ్డూ వేలంలో రికార్డు ధర పలికింది. కేవలం రూ. 1,116తో ప్రారంభమైన ఈ వేలం, మొత్తం 38 మంది భక్తుల మధ్య తీవ్ర పోటీకి దారి తీసింది. చివరికి, లింగాల దశరథ్ గౌడ్ అనే భక్తుడు ఏకంగా రూ. 35 లక్షల భారీ ధరకు లడ్డూను దక్కించుకున్నారు.
ఇది గత సంవత్సరం వేలం ధర కంటే రూ. 4.99 లక్షలు అధికం కావడం విశేషం. గత ఏడాది లడ్డూ ధర రూ. 30 లక్షలకు పైగా పలికింది. లడ్డూ వేలం ముగిసిన తర్వాత, బాలాపూర్ గణేష్ విగ్రహ నిమజ్జనం ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది.

నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు
బాలాపూర్ గణేష్‌ను ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిమజ్జన ఊరేగింపు కట్టమైసమ్మ-కేశవగిరి, చాంద్రాయణగుట్ట, చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్ జీపీవో, లిబర్టీ, అంబేడ్కర్ విగ్రహం మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుంది.
నిమజ్జనోత్సవం సజావుగా సాగేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు శనివారం సెలవు ప్రకటించింది. ఈ సెలవుతో ప్రజలు నిమజ్జనోత్సవంలో పాల్గొనడానికి వీలు కలుగుతుంది.
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భక్తులు లడ్డూను దక్కించుకోవడం ద్వారా తమకు అదృష్టం, ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు. ఈసారి రికార్డు ధర పలకడం ఈ విశ్వాసానికి నిదర్శనం.












Click it and Unblock the Notifications