ఆంధ్రలో కలిపేస్తాం: బలరాంనాయక్ 'సారీ', విలీన ప్రాంత ప్రజలకు చేదు!
వరంగల్: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుంటే తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేస్తామని రెండు రోజుల క్రితం హెచ్చరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ తన వ్యాఖ్యల పైన ఆదివారం వెనక్కి తగ్గారు.
తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి, ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. నాలుగు మండలాలను ఏపీలో కలపడంతో తాను ఆవేదనతో అలా అన్నానని వివరణ ఇచ్చారు. మరోసారి ఇలాంటి అన్యాయం తనకు జరగకూడదనే బాధతోనే చెప్పానని తెలిపారు.
ఏపీ విలీన ప్రాంతాల ప్రజలకు చేదు!

పోలవరం ప్రాజెక్టు కోసం... తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన విలీన మండలాలు కనీస వైద్య సౌకర్యానికి నోచుకోలేకపోతున్నాయని అంటున్నారు. ఆ మండలాలను ఇటు తెలంగాణ, అటు ఏపీ పట్టించుకోవడం లేదంటున్నారు.
ఓ బాలిక ఇటీవల పాముకాటుకు గురైంది. నెల్లిపాక మండల పరిధిలోని కుసుమనపల్లి గ్రామానికి చెందిన బాలిక ఒకటో తరగతి చదువుతోంది. శుక్రవారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటుండగా పాము కాటేసింది. కుటుంబ సభ్యులు 108కి సమాచారం ఇచ్చారు.
అయితే, ఆ గ్రామానికి తెలంగాణ ప్రాంత వాహనం వచ్చే అవకాశం ఉందని, అయితే వారు వచ్చేందుకు నిరాకరించారని చెప్పారట. దీంతో బాలికను బైక్ పైన భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఏపీ ప్రజలకు ఇక్కడ వైద్యం చేయమని వైద్య సిబ్బంది తేల్చి చెప్పారని వార్తలు వస్తున్నాయి. దీంతో, వారు ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.












Click it and Unblock the Notifications