రావో, రెడ్డో, శర్మనో కాకపోవడమేనా.: అవమానించారంటూ శివమెత్తిన బాల్క సుమన్

కరీంనగర్: తాను కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఎంపీనేనని, సమావేశానికి, కార్యక్రమాలకు పిలవకుండా తనను అవమానపరుస్తున్నారని పెద్దపల్లి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన పేరు వెనక సుమన్‌ శర్మనో.. సుమన్‌ రావు అనో.. లేదంటే సుమన్‌ రెడ్డి అనో ఉంటే పిలిచేవారేమోనని కరీంనగర్ జిల్లా అధికారులపై పెద్దపల్లి ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరీంనగర్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ అధ్యక్షతన విజిలెన్స్‌, మానిటరింగ్‌ సెల్‌ కమిటీ సమావేశం శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశానికి హాజరైన ఎంపీ బాల్క సుమన్‌ వచ్చీరావడంతోనే అధికారులపై మండిపడ్డారు. సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు అని చెప్పి ఉదయం 11 గంటలకే ఎలా ప్రారంభిస్తారని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Balk Suman

తాను పెద్దపల్లి ఎంపీనని, ఆ నియోజకవర్గం కరీంనగర్‌ జిల్లాలోనే ఉందన్న విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని ఆయన మండిపడ్డారు. శిలాఫలకాలపైనా తన పేరును ఎక్కడో చేరుస్తున్నారని, ప్రొటోకాల్‌ సరిగా పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల జాబ్ మేళా పెడితే తనను పిలువలేదని, మొన్న కేంద్ర మంత్రి వచ్చిపోతే చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. అసలు మీకు తాను ఎలా కనిపిస్తున్నానని, పార్లమెంటు ప్రివిజేల్ కమిటీ దావ్రా నోటీసు ఇస్తే మీరు ఢిల్లీలో నిలబడాల్సి వస్తుందని, ఏమనుకుంటున్నారో జాగ్రత అని ఆయన మండిపడ్డారు.

అధికార పార్టీ ఎంపిగా ఉన్న తాను ఇలా మాట్లాడాల్సి వస్తున్నందుకు బాధగా ఉందని, అధికారుల తీరుకు నిరసనగా వాకౌట్ చేసి వెళ్దామని వచ్చానని, కానీ మంత్రి ఈటెల రాజేందర్, ఎంపి వినోద్ కుమార్‌లను చూసిన తర్వాత ఆ పని చేయలేకపోతున్నానని గద్గదస్వరంతో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+