తెలంగాణలో మరో భారీ పెట్టుబడి: ఖమ్మంలో రూ. 250 కోట్లు ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రముఖ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. వంటనూనెల ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటు కోసం గోద్రెజ్ సంస్థ తెలంగాణలో 250 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో వంట నూనెల ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు గోద్రెజ్ సంస్థ ప్రకటించింది.
ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ఎండీ బలరాం సింగ్ యాదవ్ సమావేశమయ్యారు. ఈ మేరకు పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో ప్రత్యక్షంగా 250 మందికి, పరోక్షంగా 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కాగా, ఖమ్మం జిల్లాలో ఓ ప్రైవేట్ సంస్థ పెడుతున్న పెద్ద పెట్టుబడి ఇదే కావడం గమనార్హం.

ఖమ్మం జిల్లాలో పామాయిల్ ప్రాసెసింగ్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. 2025-26 వరకు ప్లాంటును పూర్తిస్థాయిలో నడపాలని భావిస్తున్న గోద్రెజ్ సంస్థ.. గంటకు 30 టన్నుల ప్లాంటును ప్రతిపాదిస్తోంది. దాన్ని గంటకు 60 టన్నుల సామర్థ్యానికి కూడా పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. గోద్రెజ్ సంస్థ పెట్టుబడిని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్వాగతించారు.
ఆయిల్ పామ్ సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన శ్రద్ధ ఫలితాలను ఇస్తోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలు అద్భుతంగా ఉన్నాయని గోద్రెజ్ సంస్థ ప్రశంసించింది. ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు పామాయిల్ రైతుల కోసం 10 గోద్రెజ్ సమాధాన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు గోద్రెజ్ కంపెనీ తెలిపింది.
Welcome to Godrej Agrovet Ltd., one of the largest edible oil developers in India, as they announce a 30 TPH edible oil processing plant, expandable to 60 TPH with an investment of ₹250 Cr. in Telangana
— KTR (@KTRTRS) January 5, 2023
The focus of Hon’ble CM KCR Garu in promoting Oil Palm is yielding results pic.twitter.com/dYCcfsZoyR
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది ఏళ్లలో దాదాపు రూ.3 లక్షల 30 వేల కోట్లు విలువైన పెట్టుబడులు వచ్చినట్లు ఇటీవల మంత్రి కేటిఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, పాలనలో పారదర్శకత, సీఎం కేసీఆర్ ఆలోచనలతో కార్యరూపం దాల్చిన టీఎస్ ఐపాస్‌తో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు.
రాష్ట్రానికి ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం తమ ప్రభుత్వం సాధించిన ఘన విజయమని ప్రకటించారు మైనింగ్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, ఆతిథ్యం, ఇతర రంగాల్లోకి వచ్చిన పెట్టుబడులన్నీ కలిపితే వాటి విలువ మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ కృషితో లక్షలాది మందికి ఉపాధి లభించిందని మంత్రి కేటీఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications