హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రపంచ గుర్తింపు తెస్తాం: దత్తాత్రేయ, యోగాతో ఆరోగ్యమన్న అలీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మనదేశంలో పుట్టిన యోగాకు ప్రపంచ గుర్తింపు తెచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నం ఫలిస్తోందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్ట్ ఎక్సోటికా సంస్థ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ‘వరల్డ్ యోగా అండ్ ఆరోగ్య కన్వెన్షన్' గురువారం ప్రారంభమైంది.

ఈ సందర్భంగా దత్తత్రేయ మాట్లాడుతూ.. యోగాకు సంబంధించిన అంశాలను పాఠ్యాంశాల్లో చేర్పించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సిఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.. ఆరోగ్యం కోసం యోగా చేయాల్సిందేనని, ఈ దినోత్సవానికి రాజకీయ రంగు పులమడం తగదన్నారు.

దత్తాత్రేయ

దత్తాత్రేయ

మనదేశంలో పుట్టిన యోగాకు ప్రపంచ గుర్తింపు తెచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నం ఫలిస్తోందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.

మహమూద్ అలీ

మహమూద్ అలీ

జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్ట్ ఎక్సోటికా సంస్థ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ‘వరల్డ్ యోగా అండ్ ఆరోగ్య కన్వెన్షన్' గురువారం ప్రారంభమైంది.

యోగా

యోగా

ఈ సందర్భంగా దత్తత్రేయ మాట్లాడుతూ.. యోగాకు సంబంధించిన అంశాలను పాఠ్యాంశాల్లో చేర్పించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

యోగా

యోగా

కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సిఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.. ఆరోగ్యం కోసం యోగా చేయాల్సిందేనని, ఈ దినోత్సవానికి రాజకీయ రంగు పులమడం తగదన్నారు.

యోగా

యోగా

40ఏళ్లుగా తాను యోగా చేస్తున్నట్లు డిప్యూటీ సిఎం మహమూద్ అలీ తెలిపారు.

యోగా

యోగా

కాగా, ఈ యోగా క్యాంపులో జూన్ 21 వరకు ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు అభ్యాసం, సెమినార్లు, ఉచిత వైద్య సేవలను అందించనున్నారు.

యోగాపై అవగాహన

జలవిహార్‌లో భారతీయ జనతా పార్టీ క్రీడా విభాగం యోగా అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, వీకే సింగ్ ప్రారంభించారు. అనంతరం వీకే సింగ్ మాట్లాడుతూ.. మనసు, శరీరం, ఆధ్యాత్మికతకు సంబంధించిన యోగాను మతాలతో ముడిపెట్టడం సరికాదని కేంద్ర మంత్రి వీకే సింగ్ అన్నా రు.

వ్యక్తి దైనందిక జీవితంతో యోగా ముడిపడి ఉందని అన్నారు. అనంతరం పలువురు విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మణ్, చింతాల రాంచంద్రరెడ్డి, రాజాసింగ్, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, క్రీడా విభాగం అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పలువురు యోగా గురువులను సన్మానించారు.

English summary
Union Minister Bandaru Dattatreya on Thursday inaugurated Yoga Convention at Nampally, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X