తగ్గని బండి సంజయ్.. నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనదీక్షలకు పిలుపు; సర్వత్రా ఉత్కంఠ!!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏ మాత్రం తగ్గడం లేదు. గత రెండు రోజులుగా బీజేపీ నేతల ఆందోళనతో పోలీసులు అరెస్టు చేస్తున్నా బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వం పై పోరాటం చేస్తూనే ఉంటాము అని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా తమ పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ నిరసన దీక్షలు చేపట్టాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది.

నేడు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసన దీక్షలు

నేడు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసన దీక్షలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ప్రభుత్వ తీరుకు నిరసనగా, పోలీసుల అరెస్టు ను వ్యతిరేకిస్తూ ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు దీక్షను చేపట్టనున్నారు బిజెపి నేతలు. ఇక బండి సంజయ్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన గృహనిర్బంధంలోనే తన నివాసంలో దీక్ష చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బిజెపి చేపట్టిన నిరసన దీక్షను సక్సస్ చేయాలని బండి సంజయ్ పార్టీ శ్రేణులకు సూచించారు.

లిక్కర్ స్కాం వ్యవహారాన్ని పక్కదారి పట్టించటం కోసమే ఈ అరెస్టులు

లిక్కర్ స్కాం వ్యవహారాన్ని పక్కదారి పట్టించటం కోసమే ఈ అరెస్టులు

అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్బంధాలపై దీక్ష కు పిలుపునిచ్చిన బండి సంజయ్ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో, దానిని పక్కదారి పట్టించడం కోసం బీజేపీ నేతలను అరెస్టు చేస్తున్నారంటూ, తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇక తాను నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకుని, అక్రమంగా నిర్బంధించడం పైన కూడా నిరసన దీక్ష సందర్భంగా మరోసారి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ శ్రేణులకు సూచించారు.

 బిజెపికి వస్తున్న మైలేజ్ ఓర్చుకోలేక అరెస్టులు

బిజెపికి వస్తున్న మైలేజ్ ఓర్చుకోలేక అరెస్టులు

ప్రజల నుంచి పాదయాత్రకు విశేషమైన ఆదరణ లభించడంతో, బిజెపి కి వస్తున్న మైలేజ్ ఓర్చుకోలేక టిఆర్ఎస్ నేతలు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ నిజాయితీపరుడు అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను సస్పెండ్ చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఇంతకాలం పాదయాత్రపై లేని సమస్య ఇప్పుడే కొత్తగా పోలీసులకు వచ్చింది అంటూ ప్రశ్నించిన బండి సంజయ్, ప్రజా సంగ్రామ పాదయాత్ర ఆపడమే కెసిఆర్ పతనానికి పునాది అంటూ వ్యాఖ్యానించారు.

నేడు ఆందోళనల నేపధ్యంలో ఉత్కంఠ

నేడు ఆందోళనల నేపధ్యంలో ఉత్కంఠ

మొత్తానికి ఈ రోజు కూడా బండి సంజయ్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళనలకు సమాయత్తం అవుతున్నాయి. ఇక తెలంగాణా వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల ఆందోళన నిర్వహించనున్న నేపథ్యంలో, పోలీసులు ఆందోళన అడ్డుకుంటారా? బిజెపి నేతలు ఏం చేయబోతున్నారు? అనేది రాష్ట్ర రాజకీయాలలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+