తగ్గేదేలేదంటున్న బండి సంజయ్.. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో బైక్ ర్యాలీలు, లక్ష్యం అదే!!
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఇచ్చిన జోష్ తో తెలంగాణ రాష్ట్రంలో దూసుకుపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను రచిస్తున్న వేళ బండి సంజయ్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ప్రజాక్షేత్రంలోకి బీజేపీ ని తీసుకు వెళ్లడం పై పార్టీ నేతలు చర్చించారు.

అన్ని నియోజకవర్గాలలో బీజేపీ బైక్ ర్యాలీల ప్లాన్
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో భారీ ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించాలని ఈ సమావేశంలో బిజెపి నేతలు నిర్ణయించారు. బీజేపీని జనాల్లోకి బాగా తీసుకెళ్లటం, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చెయ్యటంపై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజు ఐదారు గ్రామాలలో కొనసాగే ఈ బైక్ ర్యాలీల కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్ జూలై 10వ తేదీన తెలంగాణ కు రానున్న నేపథ్యంలో బైక్ ర్యాలీలతో పాటు, ఇతర కార్యక్రమాలు ఎప్పుడు ఎలా నిర్వహించాలనే దానిపై నిర్ణయం ఫైనల్ చేయనున్నామని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

అధికారం లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు స్థానిక సమస్యలను గుర్తించటం, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం, ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు భరోసా ఇవ్వడం, తమకు అధికారం కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం లక్ష్యంగా బీజేపీ బైక్ ర్యాలీ లను నిర్వహించనుంది. అంతేకాదు ఆగస్ట్ 15 న ప్రతీ కార్యకర్త ఇంటిపై జాతీయ జెండాని ఎగరవెయ్యాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో టీఆర్ఎస్ పై ఉన్న ప్రజా వ్యతిరేకతను ఎలాగైనా తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

సమావేశాల సక్సెస్ జోష్ తో ఎన్నికలకు సిద్ధం కావాలన్న నాయకులు
ఇక జాతీయ కార్యవర్గ సమావేశాలు సక్సెస్ చెయ్యటంపై కూడా ప్రధానంగా చర్చించారు. బీజేపీ సమావేశాల సక్సెస్ కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికీ బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా ఇంత పెద్ద ఎత్తున సభ సక్సెస్ కాలేదని, కానీ తెలంగాణాలో సమావేశాలను సక్సెస్ చేసి చూపించామని బండి సంజయ్ తెలిపారు. సమావేశాలను అడ్డుకోవటానికి టీఆర్ఎస్ ఎంత విష ప్రచారం చేసినా చివరకు సక్సెస్ అయ్యామని పేర్కొన్నారు. ఇక ఇదే జోష్ తో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీని చూపించే ప్లాన్
మొత్తం మీద బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయం సాధించడంతో జోష్ మీద ఉన్న తెలంగాణ బిజెపి ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి మరో కొత్త వ్యూహంతో రెడీ అవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం పార్టీగా బీజేపీని చూపించడానికి, వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీని గద్దె దించడానికి బండి సంజయ్ ఆధ్వర్యంలోని బిజెపి నాయకులు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications