Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణా ప్రజలే టీఆర్ఎస్ కు కరెంట్ షాక్ ఇస్తారు.. రెఫరెండమ్ కు రెడీనా? బండి సంజయ్

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ సీఎం కేసీఆర్ పై, కెసిఆర్ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఇప్పటికే రెండవ దశ ప్రజా సంగ్రామ యాత్రలో, ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న బండి సంజయ్ కేసీఆర్ కుటుంబ అవినీతి పాలన పై భగ్గుమంటున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని వివిధ అంశాలపై, ప్రజలను ఇబ్బంది పెడుతున్న అనేక సమస్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖలను రాస్తూ సమస్యల పరిష్కారం కోసం తన డిమాండ్లు వినిపిస్తున్నారు.

విద్యుత్ చార్జీల పెంపుపై బీజేపీ పోరు

విద్యుత్ చార్జీల పెంపుపై బీజేపీ పోరు

తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపుపై మండిపడిన బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ చార్జీల పెంపు పై ఆందోళనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అనేక సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 6 వేల కోట్ల భారాన్ని తెలంగాణ ప్రజలపై మోపుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

విద్యుత్ ఛార్జీల పెంపుపై రెఫరెండం కు సిద్ధం కండి.. బండి సంజయ్ సవాల్

విద్యుత్ ఛార్జీల పెంపుపై రెఫరెండం కు సిద్ధం కండి.. బండి సంజయ్ సవాల్

విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోకుంటే రెఫరెండమ్ కు సిద్ధం కావాలని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇటీవల బహిరంగ లేఖ కూడా రాశారు. ఈ బహిరంగ లేఖలో బండి సంజయ్ గత ఎనిమిదేళ్లుగా అసమర్థ విధానాలను అనుసరిస్తున్న మీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై ఆరు వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపిందని , ఈ ప్రజా వ్యతిరేక చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెంచిన విద్యుత్ ఛార్జీల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రెఫరెండం కు సిద్ధం కావాలంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు.

 విద్యుత్ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాలి

విద్యుత్ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాలి

ప్రభుత్వం రెఫరెండం కు ముందుకు రాకుంటే తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తుందని, దానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ఆదర్శమని, వినియోగానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామంటూ ప్రగల్భాలు పలికే మీ ప్రభుత్వం, విద్యుత్ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. విద్యుత్ ఉత్పత్తిలో నిజంగా మిగులు రాష్ట్రమైతే ప్రజల నడ్డి విరిచి విద్యుత్ చార్జీలతో రాష్ట్ర ఖజానాను నింపుకునే చర్యలను విడనాడాలని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తే జరిగేదిదే

ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తే జరిగేదిదే

రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్లకు చెల్లించాల్సిన 48 వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకపోవడంతో, అవి అప్పుల ఊబిలో కూరుకుపోయాయి అని పేర్కొన్న బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వ శాఖల నుండి చెల్లించాల్సిన బకాయిలను ఎక్కువగా ఉన్నాయి అంటూ మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపు తక్షణం ఉపసంహరించుకోవాలని ఈ విషయంలో ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలే టీఆర్ఎస్ కు కరెంట్ షాక్ ఇస్తారు అని హెచ్చరిస్తున్నా మని పేర్కొన్నారు. ఇక ఈ విషయంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తామని బండి సంజయ్ వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+